అంతా జగన్ ఇమేజ్ అంటే కుదరదు….మనం మారాల్సిందే

వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్లు.. ఇటీవ‌ల గుంటూరు జిల్లా బాప‌ట్లలోని డిప్యూటీ స్పీక‌ర్ నివాసంలో భేటీ అయ్యారు. మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ ఫలితాలపై స‌మాలోచ‌న‌లు చేశారు. ఈ క్రమంలో [more]

Update: 2021-04-13 12:30 GMT

వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్లు.. ఇటీవ‌ల గుంటూరు జిల్లా బాప‌ట్లలోని డిప్యూటీ స్పీక‌ర్ నివాసంలో భేటీ అయ్యారు. మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ ఫలితాలపై స‌మాలోచ‌న‌లు చేశారు. ఈ క్రమంలో కొంద‌రు వైసీపీ సీనియ‌ర్లు కొన్ని సంచ‌న‌ల వ్యాఖ్యలు చేసిన‌ట్టు స‌మాచారం. “మ‌నం మారాలి. ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వం ప్రక‌టిస్తున్న ప‌థ‌కాలు.. సంక్షేమం అజెండాతోనే పార్టీ న‌డుస్తోంది. కానీ.. వ్యక్తులుగా మాత్రం నాయ‌కులు ఎదగ‌లేక పోతున్నారు. ఇది మున్ముందు మంచి ప‌రిణామం కాదు“ అని కొంద‌రు అన్నట్టుగా చాలా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ భేటీకి దాదాపు 15 మంది వ‌ర‌కు నాలుగు జిల్లాల నుంచి హాజ‌రైన‌ట్టు స‌మాచారం.

సంక్షేమ పథకాలవైపే….

ఇక‌, ఈ క్రమంలోనే వీరు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం.. ప్రస్తుతం ప్రజ‌లంతా.. జ‌గ‌న్ అమలు చేస్తున్న సంక్షేమం వైపు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ఏటా వారికి అందుతున్న వివిధ ప‌థ‌కాల రూపంలో డ‌బ్బులు చూస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది క‌నుక‌.. ఎక్కడా వ్యతిరేక‌త లేద‌ని అనుకుంటున్నారు. కానీ, త‌ర‌చి చూస్తే.. కొన్ని వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాపు, ఎస్సీల్లోని మాల సామాజిక వ‌ర్గం ప్రజ‌లు జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. నాయ‌కులు డ‌మ్మీలుగా మారిపోతార‌నేది వైసీపీ సీనియ‌ర్ల అభిప్రాయం.

ఆ దిశగా…..

ఇక వైసీపీ ఇంత ప్రజాభిమానంతో ఉన్నా కూడా కొన్ని సామాజిక వ‌ర్గాల ప్రజ‌లు పార్టీకి దూరం అవుతున్నార‌న్న విష‌యం కూడా వీరి మ‌ధ్య ప్రస్తావ‌న‌కు వ‌చ్చిందంటున్నారు. రేపు వీరిలో అసంతృప్తి పెరిగితే అది పార్టీకి మ‌రింత దెబ్బ అవుతుంద‌ని కూడా వీరు సందేహించార‌ని తెలిసింది. ఈ క్రమంలో నాయ‌కులు నాయ‌కులుగా ప్రజ‌ల్లోకి వెళ్లి.. వారికంటూ.. గుర్తింపు పొందాల‌నేది సీనియ‌ర్ల సూచ‌న‌. ప్రస్తుతం జ‌ర‌గిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ హవానే .. న‌డిచింది. నాయ‌కులు పెద్దగా వారి హ‌వాను ప్రద‌ర్శించ‌లేదు. పైగా ఎవ‌రూ కూడా ఆదిశ‌గా ప్రయ‌త్నం చేయ‌లేదు.

రెండూ కలిస్తేనే..?

ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ.. మ‌రో మూడేళ్ల త‌ర్వాత నాయ‌కులు బ‌లంగా లేక‌పోతే.. ప్రజ‌లు తిర‌స్కరించే ప్రమాదం ఉందని వైసీపీ సీనియ‌ర్లు పేర్కొంటున్నారు.అయితే.. ఉభ‌య కుశ‌లోప‌రిగా .. ఇటు జ‌గ‌న్ హ‌వా.. అటు నాయ‌కుల బ‌లం రెండూ క‌లిస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలుపు సాధ్య‌మ‌వుతుంద‌ని వీరు తీర్మానించిన‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి కూడా తీసుకువెళ్లి.. దీనిపై ఒక రోడ్ మ్యాప్ రూపొందించి.. నాయ‌కుల‌కు.. ప్రజ‌ల‌కు మ‌ధ్య పెరుగుతున్న అంత‌రాన్ని త‌గ్గించాల‌ని వీరు సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News