వైసీపీలో చేరడం కంటే.. బావిలో దూకడం బెటరట

అధికార పార్టీ వైపు ఎవరైనా చూస్తారు. పవర్ లో ఉన్న పార్టీలోకి వెళితే ఆర్థికంగా బలపడతామని భావిస్తారు. కాంట్రాక్టులు, చిన్నా చితకా పనులతో పాటు వచ్చే ఎన్నికలకు [more]

Update: 2021-01-30 12:30 GMT

అధికార పార్టీ వైపు ఎవరైనా చూస్తారు. పవర్ లో ఉన్న పార్టీలోకి వెళితే ఆర్థికంగా బలపడతామని భావిస్తారు. కాంట్రాక్టులు, చిన్నా చితకా పనులతో పాటు వచ్చే ఎన్నికలకు నిధుల సమీకరణ చేసుకోవచ్చని అనుకుంటారు. అందుకే అధికార పార్టీలోకి జంప్ లు అధికంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైసీపీలో చేరేందుకు విపక్ష పార్టీకి చెందిన వారు సుముఖంగా లేరు. అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడచిపోయాయి. ఈ ఇరవై నెలల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అనధికారికంగా చేేరారు. జనసేన ఎమ్మెల్యే కూడా మద్దతుగానే నడుస్తున్నారు.

ఇటు వైపు చూడటానికి….

టీడీపీ నేతలు వైసీపీ వైపు చూడకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ఒరగబెట్టేదేమీ లేదంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ రావడంతో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయింది. చిన్నా చితకా పనులకు ఎమ్మెల్యేల వద్దకు వచ్చే ప్రజలు అటు వైపు చూడటం లేదు. ఇక కాంట్రాక్టులు, పెద్ద పెద్ద పనులను ఎమ్మెల్యేల వద్దకు కూడా దరిచేరనీయడం లేదంటున్నారు.

అన్ని రకాల ఆదాయమార్గాలను…

ఇసుక తవ్వకాలపై కూడా జగన్ ఆంక్షలు విధించారు. దీంతో పాటు మద్యం షాపులు కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లాయి. ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేసేదేమీ లేదంటున్నారు. రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరైనా పైనుంచి ఫోన్ రావడంతో ఎవరో ఒకరికి ఆపనులను అప్పగించాల్సి వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పార్టీలో సంతోషంగా లేనప్పుడు మనం అక్కడకు వెళ్లి ఏం చేస్తామని ఆలోచనలో పడి జంప్ చేయలేదంటున్నారు.

చేరిన వారి పరిస్థితే….

పార్టీలను కాదని వైసీపీకి మద్దతుగా నిలిచిన ఐదుగురు ఎమ్మెల్యే పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. లేకుంటే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరాల్సి ఉంది. వారిని చేర్చుకుని చంద్రబాబు ప్రతిపక్ష హోదాను దెబ్బతీయాలని వైసీపీ ఆలోచించింది. అయితే నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే పడుతున్న బాధలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ఆలోచనను విరమించుకున్నారట. సో.. ఇక వైసీపీలోకి చేరికలు పెద్దగా ఉండబోవనే అనుకోవాలి.

Tags:    

Similar News