జగన్ టీం అదేపనిలో అట

ఒక్క ఏపీలోనే కాకుండా టీడీపీకి జాతీయ రాజ‌కీయాల్లోనూ క‌ష్టాల కాలం ఎదురు కానుందా ? ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో టీడీపీ తీవ్రస్థాయిలో ఇబ్బంది [more]

Update: 2019-12-25 13:30 GMT

ఒక్క ఏపీలోనే కాకుండా టీడీపీకి జాతీయ రాజ‌కీయాల్లోనూ క‌ష్టాల కాలం ఎదురు కానుందా ? ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో టీడీపీ తీవ్రస్థాయిలో ఇబ్బంది ప‌డుతోంది. ఈ ప‌రిణామం ఇప్పుడు ఏపీలో స్పష్టంగా క‌నిపిస్తోంది. చంద్రబాబును న‌మ్ముకున్న వారంతా ఇప్పుడు జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణయాల‌తో రోడ్డున ప‌డుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి రాష్ట్రంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిపోయింది. ఇక‌, ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లోనూ చంద్రబాబును ఏకాకి చేసే దిశ‌గా జ‌గ‌న్ టీం ప‌నిచేస్తోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మికి ప‌రోక్షంగానో.. ప్రత్యక్షంగానో.. జ‌గ‌న్ మ‌ద్దతివ్వాల‌ని నిర్ణయించుకున్నారు.

బలహీనమవ్వడంతో….

నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా ఆది నుంచి చంద్రబాబు ఎన్డీయేకు మ‌ద్దతుదారుగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకొని ఆయ‌న రాజ‌కీయాలు చేశారు. కేంద్రంతో స‌ఖ్యత‌గా ఉన్నా.. కేంద్రం తో విభేదించినా.. ఆయ‌న వాయిస్ బాగానే వినిపించింది. అయితే, ఇప్పుడు లోక్‌స‌భ‌లో చంద్రబాబు బలం కేవ‌లం ముగ్గురే. రాజ్యస‌భ‌లో ఉన్న న‌లుగురు ఎంపీలు ఇప్పటికే బీజేపీలోకి వెళ్లిపోయారు. గ‌తంలో రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేద‌నే కార‌ణంగా చంద్రబాబు బీజేపీతోనూ ప్రధాని న‌రేంద్ర మోడీతోనూ తీవ్రం గా విభేదించారు.

ఏకాకిని చేయాలని…..

అయితే, ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం, రాష్ట్రంలో బ‌ల‌మైన ప్రభుత్వం ఏర్పాటుతో చంద్రబాబు మ‌ళ్లీ ఎన్డీయేలోని బీజేపీ స‌హా పాత మిత్రుల‌తో స్నేహం కోసం చేతులు చాస్తున్నారు. అమిత్ షా, మోడీ నిర్ణయాల‌ను పొగుడుతున్నారు. బీజేపీలో ఉన్న త‌న శిష్యుల‌తో ఎన్డీయేకు ద‌గ్గర‌య్యే ప్రయ‌త్నాలు చేయిస్తున్నారు. ఇదిలావుంటే, ఎన్డీయే స‌మా జాతీయ స్థాయిలో చంద్రబాబు కున్న హ‌వాను త‌గ్గించి ఆయ‌న‌ను ఏకాకిని చేయాల‌నే ల‌క్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే ప్రవేశ పెడుతున్న ప్రతి బిల్లుకు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌ల్లో మ‌ద్దతు ప్రక‌టిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి లోక్‌స‌భ‌లో బ‌ల‌ం ఉన్నా.. రాజ్య స‌భ‌లో బ‌లం త‌క్కువ‌గా ఉంది.

కాంగ్రెస్ తో తప్పదా?

ఈ నేప‌థ్యంలో రాజ్యస‌భ‌లో బీజేపీకి స‌హ‌క‌రించ‌డం ద్వారా ప్రత్యక్షంగానో.. ప‌రోక్షంగానో.. ఎన్డీయేకు జ‌గ‌న్ పార్టీ ద‌గ్గర‌వ్వాల‌ని యోచిస్తోంది. ఇక‌, బీజేపీ కూడా రాష్ట్రంలో రోజురోజుకు పుంజుకుంటున్న జ‌గ‌న్‌తో క‌లిసి వెళ్లడం ద్వారా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తోంది. జ‌గ‌న్ ఎన్డీయేలో చేరే ఛాన్సులు లేక‌పోయినా… బీజేపీకి ఏదోలా స‌హ‌క‌రించ‌డ‌మే మేల‌న్న నిర్ణయానికి వ‌చ్చేశారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎన్డీయేకు మ‌ద్దతిస్తే.. దాదాపుగా చంద్రబాబును ఎన్డీయే వ‌దిలించుకునేందుకు రెడీ అవుతుంది. ఇదే జ‌రిగితే.. ఇక‌, చంద్రబాబు ఏకాకి కావడం ఖాయ‌మ‌ని అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అప్పుడు భవిష్యత్తులో టీడీపీ వెళితే గెలితే కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్లాలి.. లేక‌పోతే ఏకాకిగా మిగిలిపోవాలి.

Tags:    

Similar News