డై హార్డ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు

వైసిపి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. పార్టీ అధినేత వారికేదో చేయలేదని వారి బాధ కాదు. ప్రస్తుత దశలో వైఎస్ ఆర్ పార్టీ కి ఏ [more]

Update: 2019-10-10 03:30 GMT

వైసిపి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. పార్టీ అధినేత వారికేదో చేయలేదని వారి బాధ కాదు. ప్రస్తుత దశలో వైఎస్ ఆర్ పార్టీ కి ఏ మాత్రం అవసరం లేకపోయినా ఆయారాం గయారాం లను చేర్చుకోవడం వారికి నచ్చలేదు. ఇలా చేర్చుకుంటూ పోతే వైసిపి కి తెలుగుదేశానికి తేడా ఏముందన్నది వారి ప్రశ్న. వైసిపి నుంచి ఉద్భవించి టిడిపి లో చేరి జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జూపూడి ప్రభాకరరావును ఎందుకు చేర్చుకోవాలిసిన అవసరం అంటూ ఈ గొడవ మొదలైంది.

ఇలా చేరారో లేదో …

విజయదశమి మంచి రోజు కావడంతో జూపూడి ప్రభాకర రావు, రాజమండ్రి మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ జగన్ సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ ఇలా చేరారని ప్రకటన వచ్చిందో లేదో సోషల్ మీడియా లో వైసిపి లో బలమైన డై హార్డ్ ఫ్యాన్స్ నిరసనలు వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెట్టేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇలా అయితే అన్యాయమే జరుగుతుందని వారంతా వాపోతున్నారు.

ఫ్యాన్ పార్టీ క్యాడర్ లో…..

ఏదో ఒక హామీ లేకుండా ఎవ్వరు పార్టీలో చేరేందుకు రారన్న నమ్మకంతో దీనివల్ల పార్టీ కోసం జగన్ కోసం పదేళ్ళుగా రక్తం చిందించిన వారు ఏమై పోతారన్నది ఫ్యాన్స్ ఆందోళనగా కనిపిస్తుంది. వైసీపీ అభిమానులే జూపూడి ప్రభాకర్ రావు కు వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెడుతున్నారు. జగన్ నిర్ణయం సరికాదని చెబుతున్నారు. జగన్ జూపడి చేరికపై ఆలోచించుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుుతన్నారు. మరి వీరి ఆగ్రహాన్ని జగన్ ఎలా చల్లారుస్తారో చూడాలి.

Tags:    

Similar News