వైసీపీలో లుకలుకలు…టీడీపీలో కలవరం…!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు బాగా పెరిగిపోతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, నేతలకు అసలు సెట్ కావడం లేదు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. [more]

Update: 2020-09-14 05:00 GMT

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు బాగా పెరిగిపోతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, నేతలకు అసలు సెట్ కావడం లేదు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇక ఇలాంటి ఆధిపత్య పోరుకు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఏమి అతీతంగా లేదు. ఇక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అసలు పొసగడం లేదు. అసలు ఎన్నికల్లో బూచేపల్లి పోటీ చేయాల్సింది. కానీ తను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండటంతో పోటీ చేయలేనని చెప్పడంతో, మద్దిశెట్టి సీటు దక్కించుకుని విజయం సాధించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో బూచేపల్లి డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మద్దిశెట్టి, బూచేపల్లి వర్గాలకు అసలు పడటం లేదు.

నాలుగు గ్రూపులుగా…..

ఇదే సమయంలో మొన్నటివరకు టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సైతం వైసీపీలోకి రావడంతో దర్శిలో మరో వర్గం తయారైంది. శిద్ధా టీడీపీలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు మంత్రిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న పార్టీ మార‌గా ఆయ‌న‌తో వ‌చ్చిన వ‌ర్గం ద‌ర్శిలో మూడో వ‌ర్గంగా ఉంది. ఇలా మూడు వర్గాల మధ్య దర్శి వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. త్వర‌లోనే బూచేప‌ల్లి త‌ల్లి వెంకాయ‌మ్మకు ప్రకాశం జిల్లా జ‌డ్పీచైర్‌ప‌ర్సన్ పీఠం దాదాపు ఖ‌రారైన‌ట్టే అంటున్నారు. ఎన్నిక‌ల్లో శివ‌ప్రసాద్ రెడ్డి పోటీ చేయ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ఆ ఫ్యామిలీకి జ‌డ్పీచైర్‌ప‌ర్సన్ పీఠంపై హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. బూచేప‌ల్లి ఫ్యామిలీకి ప‌ద‌వి కూడా వ‌స్తే ద‌ర్శిలో వైసీపీ యుద్దం ఇప్పట్లో స‌మ‌సేలా లేదు.

సరైన నాయకత్వం లేక….

వైసీపీలో లుకలుకలు ఉంటే, టీడీపీ శ్రేణుల్లో మాత్రం కలవరం మొదలైంది. అసలు ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు శిద్ధా వైపు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మొన్న ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలయ్య ఫ్రెండ్ కదిరి బాబూరావు సైతం వైసీపీలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. దీంతో దర్శి టీడీపీకి దిక్కులేకుపోయింది. వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తుంది కాబట్టి, త్వరగా టీడీపీకి కొత్త నాయకుడుని దించితే ఏమన్నా బెన్‌ఫిట్ ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే ఎంత త్వరగా నాయకుడుని పెడితే అంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు టీడీపీకి కొత్త నాయకుడు దొరకడం కష్టం. కాకపోతే ఎన్‌ఆర్‌ఐ చేకూరి కోటేశ్వరరావు చౌదరి దర్శిలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రయోగాన్ని……

అయితే గ‌తంలో ద‌ర్శిలో చంద్రబాబు ఈ ఎన్ఆర్ఐ ప్రయోగాలు కూడా చేసి ఫెయిల్ అయ్యారు. 2009 ఎన్నిక‌ల్లో మ‌న్నెం వెంక‌ట‌ర‌మ‌ణారావు అనే నేత‌ను ఆయ‌న అమెరికా నుంచి దింపారు. ఆ ఎన్నిక‌ల్లో ఓడిన వెంట‌నే ఆయ‌న అడ్రస్ లేకుండా పోయారు. మ‌రోసారి ఇప్పుడు ఇక్కడ బాబు ఎన్నారై అస్త్రానే ప్ర‌యోగిస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News