రాజకీయ తుఫాన్ రూట్ మారిందే?

దేశం అంతా ఒక రూట్ లో వెళుతుంటే ఏపీ లో మాత్రం రాజకీయాలు మరో రూట్ లో పోతూ ఉంటాయి. అది తుఫాన్ లు కావొచ్చు , [more]

Update: 2020-05-06 06:30 GMT

దేశం అంతా ఒక రూట్ లో వెళుతుంటే ఏపీ లో మాత్రం రాజకీయాలు మరో రూట్ లో పోతూ ఉంటాయి. అది తుఫాన్ లు కావొచ్చు , కరోనా కావొచ్చు ఏపీ పొలిటికల్ హీట్ మాత్రం ఎండాకాలమే కాదు అన్ని కాలాల్లో ఉంటుంది. తాజాగా జగన్ సర్కార్ వచ్చాక విపక్షాలు అతి కొద్దికాలమే సైలెంట్ గా ఉండగలిగాయి. ఆ తరువాత తమ సహజ ధోరణిలో అధికార పక్షం ఏమి చేసినా తప్పు అంటూ దాడి మొదలు పెట్టేశాయి. ఇక విపక్షాలు అంత చేస్తుంటే అధికారపక్ష వైసీపీ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. దాడికి ఎదురుదాడి రొటీన్ గానే మొదలు పెడుతూ రాజకీయ రణరంగాన్ని రక్తి కట్టిస్తూనే ఉంది. ఈ గొడవలన్నిటిలో అమరావతి లో రాజధాని అనే అంశం ఇప్పుడు పూర్తిగా కనుమరుగే అయిపోవడం గమనార్హం.

స్థానిక ఎన్నికలు మొదలు …

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు మొదలు కాగానే రాజకీయ యుద్ధం పెద్ద స్థాయిలో అన్ని పార్టీలు మొదలు పెట్టేశాయి. కట్ చేస్తే కరోనా ఎఫెక్ట్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు మధ్యలో ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేయడంతో ఇక పొలిటికల్ వార్ వైసీపీ వెర్సెస్ టిడిపి గా మారిపోయింది. ఇందులో జనసేన, బిజెపి , కమ్యూనిస్ట్ లు మధ్యలో దూరినా మాటల యుద్ధం మాత్రం అధికారపక్షం, ప్రధాన విపక్షం నడుమే నడిచింది. ఈ లోగా వైరస్ మహమ్మారి ఎపి ని చుట్టుముట్టింది. అంతే ప్రభుత్వం అందించే సాయం పై వ్యవహారం టర్న్ అయిపొయింది. అది కూడా పూర్తి అయింది అనుకుంటున్న దశలో కరోనా టెస్ట్ కిట్ లలో గోల్ మాల్ అంటూ గోల మొదలైపోయింది.

అన్ని పోయి మందు మిగిలింది …

పై వ్యవహారాలన్నీ ఇప్పుడు ఏపీ లో పక్కకు పోయాయి. మద్యం దుకాణాలను జగన్ సర్కార్ తెరవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మందుబాబులు చాలా కాలం తరువాత మద్యం ఓపెన్ చేయడంతో తీర్ధం కోసం ఎగబడ్డారు. అది అందరిలో ఒక్కసారి కలవరం సృష్ట్టించింది. అధికారపక్షం ఇరుకునపడితే విపక్షానికి ఈ వ్యవహారం మరో ఆయుధం అందించింది. దీనికి తోడు మద్యం అమ్మకాలు ప్రారంభిస్తూనే 25 శాతం ధరలు పెంచడం అయినా కానీ కొనుగోలుకు ఎవ్వరు వెనుకాడక పోవడంతో ఈ 25 కు మరో 50 శాతం కలిపి 75 శాతం మద్యం అమ్మకాలపై ధర పెంచడం కొత్త వివాదానికి తెరతీసింది.

రక్త కట్టడం లేదే?

సంపూర్ణ మద్యపానం దిశగా వెళతామని కీలకమైన వైరస్ పై పోరాటం సమయంలో జగన్ సర్కార్ మద్యం పైనే ఆదాయాన్ని నమ్ముకోవడం మాత్రం ఎంత సమర్ధించుకున్నా సర్కార్ కి చెడ్డ పేరే తెచ్చిపెట్టింది. ఈ తప్పును కేంద్రంపై నెట్టాలని విపక్షాలపై ఎదురుదాడికి వినియోగించుకోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం రక్తి కట్టడం లేదు. దీనికి తోడు ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని ధరలను జగన్ సర్కార్ అమలు చేయడంతో మందుబాబుల కోపం మరింత తారాస్థాయికి చేరింది. మరి ఈ పరిణామాలను అధికారపార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags:    

Similar News