అన్నింటినీ మంటగలిపేశారు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంప్రదాయాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించేందుకు ఎవరూ సిద్దపడటం లేదు. రాజకీయాల్లో విలువలకకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధపడటం [more]

Update: 2020-11-24 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంప్రదాయాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించేందుకు ఎవరూ సిద్దపడటం లేదు. రాజకీయాల్లో విలువలకకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధపడటం లేదు. గతంలో ఉన్న సంప్రదాయాలకు భిన్నంగా అన్ని పార్టీలూ వ్యవహరిస్తున్నాయి. గతంలో ప్రజాప్రతినిధి మరణిస్తే అక్కడ విపక్షాలు పోటీకి దూరంగా ఉండేవి. ఏకగ్రీవానికి సహకరించేవి. మరణించిన సభ్యుడి కుటుంబ సభ్యులకే ఆ సీటు మళ్లీ దక్కేది.

బిన్నమైన రాజకీయాలు….

కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా రాజకీయాలు జరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించారు. నిజానికి ఇక్కడ ఎన్నిక సంప్రదాయంగా ఏకగ్రీవంగా జరగాల్సి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆళ్లగడ్డ, నందిగామ ఉప ఎన్నికలు జరిగాయి. ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి మరణించారు. వైసీపీ అభ్యర్థిగా అఖిలప్రియ పోటీ చేస్తే తెలుగుదేశం పోటీకి దింపలేదు.

ఒకనాడు రెండు పార్టీలూ….

అలాగే నందిగామలో 2014 ఎన్నికల్లో గెలిచిన తంగిరాల ప్రభాకర్ రావు మృతిచెందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రావు మరణించడంతో ఆమె కుమార్తె తంగిరాల సౌమ్యకు టీడీపీ సీటు ఇచ్చింది. ఇక్కడ వైసీపీ బరిలోకి దింపలేదు. అయితే అప్పుడు కాంగ్రెస్ పోటీకి దింపింది. ఇక తర్వాత నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ పోటీకి దింపింది. నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచినా టీడీపీలోకి మారడంతో వైసీపీ శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించింది.

నంద్యాల నుంచే….

నంద్యాల ఉప ఎన్నిక నుంచే ఈ సంప్రదాయానికి వైసీపీ తెరదించేసింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ టీడీపీ పోటీకి దింపుతుంది. సానుభూతి ఓట్లు పనిచేయవని భావించిన రాజకీయ పార్టీలు సభ్యుడి మరణంతో సంభవించిన ఉప ఎన్నికల్లో కూడా సంప్రదాయానికి అన్ని పార్టీలూ తెరదించేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహృధ్భావ వాతావరణం అనేది లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పాలి.

Tags:    

Similar News