వైసీపీలో విజిటింగ్ ఎమ్మెల్యేలు.. చాలా డిఫ‌రెంట్ గురూ..!

గ‌త చంద్రబాబు హ‌యాంలో టీడీపీ నుంచి విజ‌యం సాధించిన చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దిలి పెట్టి.. దూరంగా వ్యవ‌హ‌రించ‌డం, ప‌క్కరాష్ట్రాలైన తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, [more]

Update: 2020-06-02 05:00 GMT

గ‌త చంద్రబాబు హ‌యాంలో టీడీపీ నుంచి విజ‌యం సాధించిన చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దిలి పెట్టి.. దూరంగా వ్యవ‌హ‌రించ‌డం, ప‌క్కరాష్ట్రాలైన తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల్లో వ్యాపారాలు నిర్వహించుకోవ‌డం వంటివి తీవ్రస్థాయిలో వివాదానికి దారితీశాయి. ఆయా అంశాల‌పై అప్పట్లో వైసీపీ నాయ‌కులు భారీ ఎత్తున విమ‌ర్శలు కూడా గుప్పించారు. ప‌రిస్థితి ఇప్పుడు యూట‌ర్న్ అయింది. తెలంగాణ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు జిల్లాల్లో వైసీపీ దూకుడు ప్రద‌ర్శించింది. నాయకులు గెలిచిపోయారు. టీడీపీ నేత‌ల‌ను ఓడించారు.

కనిగిరి ఎమ్మెల్యే నుంచి….

అయితే, ఇప్పడైనా ప‌రిస్థితి మారిందా? ఆయా నాయ‌కులు ప్రజ‌ల స‌మ‌క్షంలోనే ఉంటున్నారా? త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాలకే ప‌రిమిత‌మ‌య్యారా? అంటే… లేద‌నే అంటున్నారు స్థానికులు. అనంత‌పురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి గెలిచిన నాయ‌కులు స‌మీపంలోని రాష్ట్రాల రాజ‌ధానుల్లోనే ఉంటున్నా రు. వారి వ్యాపారాలు వ్యవ‌హారాలు అన్నీకూడా అక్కడే చ‌క్కబెట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ బెంగ‌ళూరులోనే ఉంటున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. త‌న వ్యాపారాలు అన్నీ కూడా బెంగ‌ళూరులోనే ఉండ‌డంతో ఆయ‌న ఎక్కువ స‌మ‌యం అక్కడే ఉంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న బెంగ‌ళూరు నుంచి వాహ‌నాల్లో కరోనా నిబంధ‌న‌లు ఉన్నా కూడా త‌న అనుచ‌రుల‌ను తీసుకు వ‌స్తూ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం వివాస్ప‌ద మైంది.

అంతా బెంగళూరులోనే…..

అదే స‌మ‌యంలో అదే ప్రకాశం జిల్లాలోని ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ నియోజ‌క‌వ‌ర్గంలో బాధ్యత‌లు త‌న అనుచ‌రుల‌కు అప్పగించి ఆయ‌న బెంగ‌ళూరు నుంచే వ్యవ‌హారాలు న‌డుపుతున్నార‌ట‌. ఇక చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో గెలిచిన వెంక‌టేగౌడ వ్యాపారాలు అన్ని బెంగ‌ళూరులోనే ఉంటాయి. అందుకే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌క్కువ‌… బెంగ‌ళూరులో ఎక్కువుగా ఉంటున్నార‌ట‌. ఇక అనంత‌పురం జిల్లా రాప్తాడులో గెలిచినతో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వంటివారు బెంగ‌ళూరులోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క అనంత‌పురం జిల్లాలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బెంగ‌ళూరులోనే మ‌కాం ఉంటున్నార‌ట‌.

వారానికి రెండు రోజులే…..

అదే స‌మ‌యంలో చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు .. ఏపీలో గెలిచినా.. త‌మ కార్యక్రమాలను, వ్యాపారాల‌ను మాత్రం స‌మీప రాష్ట్రాల్లోని రాజ‌ధానుల్లోనే నిర్వహిస్తున్నారు. దాదాపు వారానికి ఐదు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌లు త‌మ స‌మ‌స్యలు చెప్పుకోవాల‌న్నా త‌మ ఇబ్బందులు పంచుకోవాల‌న్నా కూడా స‌ద‌రు ఎమ్మెల్యేలు దూరంగా ఉండ‌డంతో ఎవ‌రికీ చెప్పుకోలేక పోతున్నారు. ఇక హైద‌రాబాద్‌లో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు లెక్కేలేదు.

జగన్ ఆదేశించినా….

వాస్తవానికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌ మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని.. ప్రభుత్వ కార్యక్రమాలు, మేనిఫెస్టోలోని అంశాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని, ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌కు ఎప్పటిక‌ప్పుడు చెక్ పెట్టాల‌ని ఆదేశిస్తున్నారు. అయినా కూడా నాయ‌కులు త‌మ త‌మ వ్యవ‌హారాలు, వ్యాపారాల్లో మునిగిపోయి.. విజిటింగ్ ఎమ్మెల్యేలుగా వ్యవ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ వ్యవ‌హారం వైసీపీకి మైన‌స్ గామారుతుంద‌ని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. వీరిలో చాలా మంది తొలిసారి ఎన్నికైన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా వ్యవ‌హ‌రిస్తారో చూడాలి.

Tags:    

Similar News