జగన్ దెబ్బకు దిగిరాక తప్పలేదే….!!!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో చిత్రమైన ప‌రిస్థ‌తి క‌నిపిస్తోంది. ఏపార్టీకి ఆ పార్టీ హామీలు కుప్పలు తెప్పలుగా ప్రక‌టిస్తోంది. ప్రజ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తోంది. ఈ [more]

Update: 2019-01-15 08:00 GMT

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో చిత్రమైన ప‌రిస్థ‌తి క‌నిపిస్తోంది. ఏపార్టీకి ఆ పార్టీ హామీలు కుప్పలు తెప్పలుగా ప్రక‌టిస్తోంది. ప్రజ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తోంది. ఈ క్రమంలో ఒక‌రిని మించి మ‌రొక‌రు.. అన్నట్టుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే నాయ‌కులు మా హామీల‌ను నువ్వు కాపీ కొట్టావంటే.. మేమేమ‌న్నా.. జూనియ‌ర్లమా అని ఎదురు దాడి చేస్తున్న పార్టీలు కూడా క‌నిపిస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌గానే.. ఏపీలో హామీల రాజ‌కీయం భారీ ఎత్తున సాగుతోంది. తాజాగా చంద్రబాబు ప్రక‌టించిన సామాజిక పింఛ‌న్ల విష‌యంలో వైసీపీ నాయ‌కులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. మా నాయ‌కుడు ప్రక‌టించిన హామీల‌నే పూర్తిగా కాపీ కొట్టి చంద్రబాబు వాడుతున్నాడ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

ప్లీనరీలోనే ప్రకటించారని….

అంతేకాదు, త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌ అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పింఛన్లను రూ.2,000కు పెంచుతానని 2017 జూలై 8వ తేదీన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన విష‌యాన్ని వారు తెర‌మీదికి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జరిగిన ఆ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడు తూ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పించన్ల పెంపు సహా తొమ్మిది (నవరత్నాలు) పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని, అవ్వా తాతలకు రూ.2,000 చొప్పున పింఛన్‌ ఇస్తామని, దివ్యాంగులకు రూ.3,000 చొప్పున పింఛను ఇస్తామంటూ ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు.ఇదే విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

చంద్రబాబు వ్యతిరేకించి….

ఇక‌, అప్పట్లో ఈ న‌వ‌ర‌త్నాలు, పింఛ‌న్ల పెంపును తీవ్రంగా నిర‌సించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని ఎలా ప్రక‌టించార‌నే ది మ‌రోప్రధాన ప్రశ్న. వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు ఈ హామీల‌ను వ్యతిరేకించారు. ప్రభుత్వ అనుకూల మీడియాలో నూ క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇన్ని హామీలు సాధ్యం కావ‌ని, రాష్ట్రం ఇప్పటికే లోటు బ‌డ్జెట్‌లో ఉంద‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ప్రక‌ట‌న కూడా చేశారు. కానీ, నాడు కాద‌న్న నోటితో అదికూడా కేంద్రంతో స‌ఖ్యత‌గా ఉన్న స‌మ‌యంలోనే కాద‌న్న నోటితోనే ఇప్పుడు ప్రక‌టించి అమ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రోప‌క్క, జ‌న‌సేన నుంచి కూడా ఇదే త‌ర‌హా దాడి టీడీపీకి ఎదురైంది. త‌మ వ‌ల్లే ప్రభుత్వం క‌దిలింద‌ని శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితుల‌కు పింఛ‌న్లు ఇస్తోంద‌ని ఇప్పుడు వీటిని 3500 ల‌కు పెంచిందంటే త‌మ డిమాండ్‌కు త‌లొగ్గేన‌ని, తాము ప్రభుత్వం మెడ‌లు వంచామ‌ని, ఇది తాము సాదించిన విజ‌యమ‌ని చెప్పుకొంటోంది. మొత్తానికి ఏపీలో హామీల రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయ‌నేదివాస్తవం.

Tags:    

Similar News