బాబు దార్లో వెళితే ఇక అంతేనట…!!

అదేంటి దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు. ఫార్టీ యియర్శ్ ఇండస్ట్రీ. ఇక ఏపీ అసెంబ్లీలో కూడా బాబు గారి కంటే పెద్ద ముత్తయిదువ ఎవరూ లేరంటారు కదా, [more]

Update: 2019-07-04 03:30 GMT

అదేంటి దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు. ఫార్టీ యియర్శ్ ఇండస్ట్రీ. ఇక ఏపీ అసెంబ్లీలో కూడా బాబు గారి కంటే పెద్ద ముత్తయిదువ ఎవరూ లేరంటారు కదా, అటువంటి నాయకున్ని రోల్ మోడల్ గా ఎందుకు తీసుకోకూడదు. ఇది తమ్ముళ్ల వాదన అయితే సమాధానం వై.ఎస్.జగన్ వద్ద పక్కాగా ఉంది. బాబు రాజకీయ జీవితం మొత్తం చదివేసిన జగన్ ఆ దార్లో మాత్రం వెళ్ళొద్దు అని కొత్త ఎమ్మెల్యేలకు హిత బోధ చేస్తున్నారు. బాబు రాజకీయమంతా అబద్దాల మయం, కపటాల నిలయమని జగన్ గట్టిగా నొక్కి చెబుతున్నారు. వెన్నుపోట్లు, ఎదురు పోట్లు, కాళ్ళు గుంజేసి లాగేయడాలు ఇవే బాబు మార్క్ పాలిటిక్స్ అని. ఆ షార్ట్ కట్ మెదడ్ లో ఎవరూ వెళ్లరాదని ఒకటికి పదిమార్లు జగన్ తొలిసారి ఎమ్మెల్యేలు అయి వచ్చిన వారికి గట్టిగా చెబుతున్నారు.

వైఎస్సార్ నే మోసం చేశారా…?

చంద్రబాబు అసెంబ్లీలో కూడా కన్నార్పకుండా అబద్దాలు ఆడతారట. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సోదాహరణంగా చెబుతున్నారు. ఎవరో కాదు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాబు అసెంబ్లీలో ఓ నకిలీ డాక్యుమెంట్ తీసుకువచ్చారట. దాని ప్రెజెంట్ చేసి వైఎస్సార్ సర్కార్ మీద విమర్శలు చేస్తూ నానా యాగీ చేశారట. తీరా వైఎస్సార్ అసలు డాక్యుమెంట్ తీసేసరికి బాబుకు నోట మాట రాలేదుట. అయినా తాను చేసిన దాన్ని సమర్దించుకుంటూ నేను నకిలీ డాక్యుమెంట్ తేబట్టే మీరు ఒరిజినల్ బయటకు తీశారు. నిజాలు ప్రభుత్వం చేత కక్కించాలనే ఇలా చేశా అన్నారట. ఈ విషయం చెప్పిన జగన్ బాబు లా అబద్దలు ఆడేందుకు అసెంబ్లీ వేదిక కాదని అన్నారు. నీతి నిజాయతీగా ఉండాలని, అందుకే బాబు ఎవరికీ రోల్ మోడల్ కారాదని ఆయన ఒకటికి పది మార్లు చెప్పుకొచ్చారు.

ఇది సరికొత్త విమర్శ…..

ఇన్నాళ్ళు వెన్నుపోటుదారుడు అంటూ బాబుని విమర్శించిన వై.ఎస్.జగన్ ఇపుడు మరో కోణంలో బాబుని ఎమ్మెల్యేలకు చూపించడం ద్వారా ఆయన అసలు రూపాన్నే విప్పి చెప్పార‌ని అంటున్నారు. బాబుకు సుతి మెత్తగా జగన్ చేసే విమర్శగా దీన్ని భావిస్తున్నారు. మా నాయకుడు అందరికీ స్పూర్తి అని టీడీపీ తమ్ముళ్లు గట్టిగా జబ్బలు చరచుకుంటున్న వేళ బాబు లోగుట్టుని జగన్ ఇలా బట్టబయలు చేయడం ద్వారా మొత్తానికి మొత్తం గాలి తీసేశారని అంటున్నారు. మరి బాబు గారి రియాక్షన్ అసెంబ్లీలోనే చూడాలేమో.

Tags:    

Similar News