బ్రేకింగ్ : జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఎదురయింది. సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసును మళ్లీ మొదటి నుంచి [more]

Update: 2019-01-04 06:16 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఎదురయింది. సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసును మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సీబీఐ కోర్టుకు కొత్త న్యాయమూర్తి నియామకం కావాల్సి ఉంది. జగన్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని 11 ఛార్జిషీట్లు నమోదయ్యాయి. మూడు ఛార్జిషీట్ల పై విచారణ రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం జగన్ ఈ కేసుల విషయంలో హాజరవుతున్నారు.

న్యాయమూర్తి బదిలీతో….

ఈరోజు కూడా జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐకోర్టుకు హాజరయ్యారు. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది. గత రెండేళ్లుగా జగన్ కేసులను విచారిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణ ఏపీ హైకోర్టుకు బదిలీ కావడంతో ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న విచారణ మళ్లీ మొదటికి వస్తోంది. మొత్తం 11 ఛార్జిషీట్లు జగన్ పై దాఖలయ్యాయి. విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో తిరిగి విచారణ ప్రారంభం అవుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News