బిగ్ బ్రేకింగ్ : వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే…. ఏడు కత్తిపోట్లు!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది హత్యగానే ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో ఈ విషయం స్పష్టమయిందని [more]

Update: 2019-03-15 10:18 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది హత్యగానే ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో ఈ విషయం స్పష్టమయిందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రాధమికంగా ఇది హత్యేనని నిర్ధారించినట్లు తెలుస్తోంది. పోస్టు మార్టం అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పటికే పులివెందులకు చేరుకున్నారు.

శరీరంపై ఏడు కత్తిపోట్లు….

వైఎస్ వివేకాది హత్యేనని ప్రాధమిక నివేదికలో స్పష్టం కావడంతో ఆయనను ఎవరు హత్య చేశారు? అంత అవసరం ఎవరికి ఉంది? అన్నదానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. వైఎస్ వివేకాదు సహజ మరణం కాదని తేలిపోయింది. అయితే దీనికి సంబంధించి కొన్ని క్లూ లు తమకు లభించాయని, వాటితో విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News