విజయమ్మ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నారా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మకు రాజకీయాలంటే అసలు పడదు. భర్త రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె సాధారణ గృహిణి గానే ఉండటానికి ఇష్టపడ్డారు. వైఎస్ఆర్ మరణం తర్వాత [more]

Update: 2021-06-15 14:30 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మకు రాజకీయాలంటే అసలు పడదు. భర్త రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె సాధారణ గృహిణి గానే ఉండటానికి ఇష్టపడ్డారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విశాఖపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన కుమారుడు జగన్ పెట్టిన పార్టీకి మద్దతుగా ఎన్నికల సమయంలో మాత్రం విజయమ్మ ప్రచారాన్ని నిర్వహిస్తారు.

కొడుకు, కూతురు మధ్య….?

విజయమ్మ ఇప్పుడు కొడుకు, కూతురు మధ్య నలిగిపోతున్నారు. కొడుకు జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని నిలబెట్టారు. భవిష్యత్ లోనూ ఏపీ నుంచే జగన్ రాజకీయాలు చేస్తారు. అయితే ఇదే సమయంలో కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు. అయినా విజయమ్మ మాత్రం కూతరు షర్మిలకు అండగా నిలబడాల్సి వచ్చింది.

అభ్యంతరం లేదంటూ…..

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల పెట్టారు. పార్టీ పేరుపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వైఎస్సార్ టీపీ పేరుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయమ్మ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీంతో కొత్త పార్టీగా వైఎస్సార్ టీపీ తెలంగాణలో ఆవిర్భవించింది. అయితే దీనిపై జగన్ అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఒకే పేరుతో పార్టీని అక్కడ పెట్టడమేంటని ఆయన ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

జగన్ అసంతృప్తి…

ఈ విషయాన్ని విజయమ్మనే ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారని చెబుతున్నారు. ఇటు వైఎస్ షర్మిలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జగన్ కు ఆగ్రహం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పార్టీ పెట్టడంపై జగన్ ఎప్పటి నుంచో అభ్యంతరం తెలుపుతున్నా, విజయమ్మ మాత్రం కుమార్తె కోసం ఆమె వెంట నడవాల్సి వస్తుంది. ఇద్దరి మధ్య విజయమ్మ నలిగిపోతున్నారన్న చర్చ పార్టీలో నడుస్తుంది.

Tags:    

Similar News