ఆ జిల్లా పాలిటిక్స్‌లోకి విజ‌య‌మ్మ ఎంట్రీ.. నేత‌ల‌ షాక్‌…!

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నిక‌లు రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల‌ను వేడెక్కించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా అధికార వైసీపీలో ప‌ద‌వుల కోసం నాయ‌కులు అనేక రూపాల్లో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. [more]

Update: 2020-03-17 03:30 GMT

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నిక‌లు రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల‌ను వేడెక్కించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా అధికార వైసీపీలో ప‌ద‌వుల కోసం నాయ‌కులు అనేక రూపాల్లో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఎవరి అవ‌కాశం వారిది అన్నట్టుగా వారు ప్రయ‌త్నించారు. ముఖ్యంగా మండ‌లి ర‌ద్దయిపోవ‌డంతో చాలా మంది చ‌ట్టస‌భ‌లు ఆశ‌లు ఆవిరి అయిపోయాయి. జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్సన్‌, చైర్మన్‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో అన్ని జిల్లాల్లోనూ కీల‌క నాయ‌కులు ఈ ప‌ద‌వుల వేటలో త‌డిసి ముద్దవుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోనూ జ‌డ్పీ చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి విష‌యంలో అధికార పార్టీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో పోటీ ప‌డ్డారు. ఈ ప‌ద‌విని త‌మ‌కంటే త‌మ‌కు ద‌క్కించుకునేందుకు ఎవ‌రికి వారు వారి వారి స్థాయుల్లో ప్రయ‌త్నాలు చేశారు.

ఎందరో ఆశావహులు….

ఈ జిల్లాలో రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లు ఏకంగా ఆరేడుగురు ఉన్నారు. వీరంతా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. అయితే జ‌గ‌న్ వీరిని కాద‌ని ఆయ‌న‌కు స‌న్నిహితులు అయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌతంరెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. దీంతో మిగిలిన నేత‌లు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి రాదా ? అన్న ఆశ‌తో ఉన్నారు. అదే స‌మ‌యంలో పార్టీలోనే ఉన్నప్పటికీ కొంద‌రు గ‌తంలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించార‌నే కార‌ణంగా వారికి అవకాశం ద‌క్కకుండా చేసే ప్రయ‌త్నాలు కూడా జ‌రిగాయి. అయితే, ఇలాంటి జిల్లా రాజ‌కీయాల్లో ఒక్క సారిగా అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా నాయ‌కులు ప‌క్కన పెట్టాల‌ని డిమాండ్ చేసిన ఓ నాయ‌కుడి స‌తీమ‌ణికి జ‌డ్పీ చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి ద‌క్కేలా చోటుచేసుకున్న ప‌రిణామాలు వైసీపీ నేత‌ల‌కు షాకిచ్చాయి.

ఆనం ఫ్యామిలీకి….

విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరు జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌విని జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. దీంతో కీల‌క నాయ‌కులు ఈ ప‌ద‌వుల‌ను త‌మ వారికి ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన న‌ల్లప‌రెడ్డి ప్రస‌న్న కుమార్ రెడ్డి కూడా త‌మ వారికి ఈ ప‌ద‌వి కోసం ప్రయ‌త్నించారు. అయితే, దీనికి భిన్నంగా జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఆనం ఫ్యామిలీకి చెందిన ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి కూడా త‌న స‌తీమ‌ణి ఆనం అరుణ‌కు ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు. అయితే ఆనం ఫ్యామిలీ ఆదిలో టీడీపీలో ఉంద‌ని, జ‌గ‌న్‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు కూడా చేశార‌ని, కాబ‌ట్టి ఈ ఫ్యామిలీకి ఇలాంటి కీల‌క ప‌ద‌వి ఇవ్వరాద‌ని పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు వ్యతిరేక‌త వ్యక్తం చేశారు.

ఆనంకు అనుకూలంగా….

అయితే, ఈ విష‌యంలో అనూహ్యం సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి, వైసీపీ గౌర‌వాధ్యక్షురాలు వైఎస్ విజ‌యమ్మ జోక్యం చేసుకున్నట్టు స‌మాచారం.దీనికి కూడా కార‌ణం ఉంది. ఆనం సోద‌రుల రాకకు ముందుగానే ఆనం విజ‌య్‌కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న కుమారుడు కూడా వైఎస్ విజ‌య‌మ్మకు అనుచ‌రుడిగా సేవ‌లు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఆనంకు ఫేవ‌ర్ చేయాల‌ని భావించిన విజ‌య‌మ్మ ఆనం అరుణ విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌న సిఫార‌సు పంపారు.

ఆమె సిఫార్సుతోనే….

దీంతో వైసీపీ త‌ర‌ఫున ఆమెనే నామినేట్ చేస్తున్నామ‌ని అధిష్టానం కూడా ప్రక‌టించింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఒక్కసారిగా షాక‌య్యారు. ఇదిలావుంటే రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు ఈ ప‌ద‌వి ద‌క్కడం వెనుక కూడా విజ‌య‌మ్మ సిఫార‌సు ఉన్న విష‌యం తెలిసిందే. పార్టీ ప్రారంభం నుంచి సుచ‌రిత వైఎస్ కుటుంబంతోను ముఖ్యంగా విజ‌య‌మ్మ, భార‌తిలోనూ సాన్నిహిత్యంగా ఉండి. వారి క‌ష్టాల‌ను సైతం పంచుకున్నారు. మొత్తానికి నెల్లూరు జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ విష‌యంలో విజ‌య‌మ్మ ఎంట్రీ తో వైసీపీ నేత‌లు షాక్ గురికావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News