Ys sharmila : అక్క లెక్క కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే?

వైఎస్ షర్మిల ఊరికే వదిలిపెట్టరు. వైఎస్ కుటుంబం రక్తమే అంత. ఏదైనా తేల్చుకునేంత వరకూ వదలరు. జగన్ కూడా ఆ రోజు అక్రమ కేసులకు భయపడి ఉంటే [more]

Update: 2021-09-27 03:30 GMT

వైఎస్ షర్మిల ఊరికే వదిలిపెట్టరు. వైఎస్ కుటుంబం రక్తమే అంత. ఏదైనా తేల్చుకునేంత వరకూ వదలరు. జగన్ కూడా ఆ రోజు అక్రమ కేసులకు భయపడి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యే వారు కాదు. అదే దారిలో ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టారు. ఇక్కడ గెలుస్తామో లేదు తెలియదు. ఏపీలో వైసీపీ గెలిచినంత సులువుగా తెలంగాణలో మాత్రం గెలవలేరన్నది వైఎస్ షర్మిలకు తెలియంది కాదు.

ధైర్యం చేసి పార్టీ పెట్టి….

రాజకీయాలు అవపోసన పట్టకపోయినా ఆ మాత్రం నాలెడ్జ్ ఆమెకు ఉంటుందనే అనుకోవాలి. కానీ ధైర్యం చేసి తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు. కొందరు కేసీఆర్ షర్మిల చేత పార్టీ పెట్టించారన్నారు. మరికొందరు బీజేపీ వెనకుండి షర్మిలను నడిపిస్తుందని బాహాటంగానే విమర్శలు చేశారు. అయినా వైఎస్ షర్మిల వీటిని లెక్క చేయలేదు. తాను కేసీఆర్, మోదీలపై విమర్శలు చేస్తూ ఆ ఆరోపణలను చాలా వరకూ తిప్పికొట్టగలిగారు.

కాంగ్రెస్ కు నష్టమే….

ఇక వైఎస్ షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నది పక్కన పెడితే తీవ్రంగా నష్టపోయేది ప్రస్తుతానికి కాంగ్రెస్ అనే చెప్పాలి. అధికార పార్టీ టీఆర్ఎస్ కు లాభం జరగొచ్చు. జరగకపోవచ్చు. కాంగ్రెస్ కు మాత్రం తీవ్ర నష్టమేనని చెప్పాలి. వైఎస్ షర్మిల బలమైన రెండు సామాజికవర్గాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నేతలు పెద్దగా ఆమె పార్టీలో చేరకపోయినా ఓటర్లు తనకు ఆశీస్సులు అందజేస్తారన్న నమ్మకంతో ఉన్నారు.

పాదయాత్రతో….

వచ్చే నె 20వ తేదీ నుంచి వైఎస్ షర్మిల తెలంగాణ అంతటా పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఏడాది పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ పాదయాత్ర ప్రభావం కొంత ఉంటుంది. వైఎస్ షర్మిల టార్గెట్ కూడా పోలోమని పెద్ద సంఖ్యలో సీట్లు దక్కించుకోవడం కాదు. కనీస స్థానాలను సాధించి పార్టీని ఇక్కడ నిలబెట్టాలి. తాను తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాలి. కింగ్ మేకర్ కావాలి. తనకు వయసు ఉంది. చరిష్మా ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాకుండా పోతానా? అన్న లక్ష్యంతో మాత్రమే వైఎస్ షర్మిల పనిచేస్తున్నారు.

Tags:    

Similar News