ష‌ర్మిల పార్టీలోకి ఆ కీల‌క నేత‌లు జంప్‌.. ఒక్కటే హాట్ టాపిక్ ?

తెలంగాణలో ష‌ర్మిల కొత్త పార్టీ ప్రక‌ట‌న ఎంత సంచ‌ల‌నం రేపుతుందో తెలిసిందే. ఓ వైపు స్వ‌యానా సోద‌రుడు జ‌గ‌న్ ఏపీ సీఎంగా ఉన్నారు. ప‌దేళ్లుగా అన్న కోసం [more]

Update: 2021-04-24 13:30 GMT

తెలంగాణలో ష‌ర్మిల కొత్త పార్టీ ప్రక‌ట‌న ఎంత సంచ‌ల‌నం రేపుతుందో తెలిసిందే. ఓ వైపు స్వ‌యానా సోద‌రుడు జ‌గ‌న్ ఏపీ సీఎంగా ఉన్నారు. ప‌దేళ్లుగా అన్న కోసం ఆమె ఎంతో ప్రచారం చేశారు. క‌ట్ చేస్తే అన్న సీఎం అయ్యాక ష‌ర్మిల ఏపీ రాజ‌కీయ తెర‌పై నుంచి క్రమంగా తెర‌మ‌రుగు అయిపోయారు. ఏం జ‌రిగిందో కాని ఆమె ఇప్పుడు తెలంగాణ‌లో స‌రికొత్త రాజ‌కీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రక‌ట‌న చేశారు. ఆమె రాజ‌కీయ ప్రక‌ట‌న‌కు ఉమ్మడి ఖ‌మ్మం జిల్లానే తొలి వేదిక‌గా ఎంచుకున్నారు. ష‌ర్మిల కొత్త పార్టీ ప్రక‌ట‌న తెలంగాణ‌లో మిగిలిన ప్రాంతాల కంటే ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాతో పాటు న‌ల్లగొండ జిల్లాలోనే నేత‌ల మ‌ధ్య ఎక్కువ చ‌ర్చనీయాంశంగా మారింది. ఆ రెండు జిల్లాల్లోనూ వైఎస్సార్ అభిమానుల‌తో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గ ప్రభావం ఉంది. న‌ల్లగొండ‌లో రెడ్ల హ‌వానే ఎక్కువ‌. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో రెడ్లు ఉన్నా క‌మ్మ వ‌ర్గ ఆధిప‌త్యమే ఎక్కువుగా న‌డుస్తూ ఉంటుంది. అయితే పాలేరు లాంటి చోట్ల రెడ్లు ఎక్కువే.

ముఖ్యనేత ఒకరు….

ఇవ‌న్నీ ఇలా ఉంటే ష‌ర్మిల తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని కూడా ఇప్పటికే ప్రక‌టించేశారు. కొంద‌రు అవుట్ డేటెడ్ నేత‌లు.. మ‌రి కొంద‌రు రాజ‌కీయంగా ఎలాంటి అవ‌కాశం లేని నేత‌లు ష‌ర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతోన్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు చెందిన ఓ కీల‌క నేత జిల్లా అంత‌టా ఉన్న త‌న అనుచ‌ర‌గ‌ణంతో క‌లిసి ష‌ర్మిల పార్టీలోకి వెళ్లబోతున్నార‌న్న ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విష‌య‌మే ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో.. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌లో సంచ‌ల‌నంగా మారింది. గ‌తంలో వైఎస్ ఫ్యామిలీ వీర విధేయుడిగా ఉండి ఓ కీల‌క ప‌ద‌వి చేప‌ట్టిన స‌ద‌రు నేత‌.. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు.

ఆ సామాజికవర్గానిదే ఆధిపత్యం….

అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జిల్లాలో టీఆర్ఎస్ ఓడిపోవ‌డానికి ప్రధాన కార‌ణం ఆ నేతే అన్న ఫిర్యాదులు ఎక్కువుగా వెళ్లడంతో ఆ త‌ర్వాత ఆయ‌న సిట్టింగ్ సీటు కూడా ఆయ‌న‌కు ఇవ్వలేదు. ఇక ఓ మంత్రి స‌ద‌రు నేత‌ను పూర్తిగా రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కుతోన్న ప‌రిస్థితి. దీనికి తోడు జిల్లాలో టీఆర్ఎస్‌లో మ‌రో సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఉండ‌డంతో రెడ్డి వ‌ర్గానికి చెందిన ఆ నేత‌ను ఇప్పుడు కారు పార్టీలో ప‌ట్టించుకున్న వాళ్లే లేకుండా పోయారు. మ‌ధ్యలో కేటీఆర్ పిలిచి భ‌విష్యత్తు ఉంటుంద‌ని బుజ్జగించినా అవి గాలిమీద రాత‌లుగానే మారాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గులాబీ పార్టీలో జిల్లాలో ఒకే సామాజిక వ‌ర్గానికే చెందిన ముగ్గురు నేత‌ల హ‌వానే ఉంది.

తనతో పాటు మరికొందరు…

ఈ క్రమంలోనే స‌ద‌రు అసంతృప్త రెడ్డి నేత త‌న‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న త‌న అనుచ‌ర‌గ‌ణంతో టైం చూసుకుని ష‌ర్మిల పార్టీలోకి వెళ్లిపోనున్నార‌ని ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. తాను ఎంపీగా పోటీ చేయ‌డంతో పాటు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న త‌న అనుచ‌రుల‌ను కూడా ఆయ‌న త‌న‌తో ష‌ర్మిల పార్టీలోకి తీసుకు వెళ్లిపోయేలా చ‌ర్చలు కూడా స్టార్ట్ అయ్యాయంటున్నారు. ష‌ర్మిల పార్టీ తెలంగాణ‌లో ఎలా ఉన్నా.. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాతో పాటు న‌ల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బ‌ల‌మైన ప్రభావం చూపేలా ఉంది. మ‌రి ఈ అసంతృప్త రెడ్డి నేత‌ను గులాబీ నాయ‌కులు బుజ్జగించి ఆపుతారో ? లేదా ఆయ‌న ష‌ర్మిల పార్టీ జెండా క‌ప్పుకుంటారో ? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News