షర్మిల వ్యూహమేంటి? అంత ఈజీయా?

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నారు. ఖమ్మం సభ కూడా విజయవంతం కావడంతో షర్మిలలో మరింత ఆశలు పెంచాయి. తాను తెలంగాణ బిడ్డగానే చెప్పుకునేందుకు [more]

Update: 2021-04-10 11:00 GMT

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నారు. ఖమ్మం సభ కూడా విజయవంతం కావడంతో షర్మిలలో మరింత ఆశలు పెంచాయి. తాను తెలంగాణ బిడ్డగానే చెప్పుకునేందుకు వైఎష్ షర్మిల ఈ సభలో ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజలు షర్మిలను ఎంత మాత్రం దరి చేర్చుకుంటారన్నది ప్రశ్నగా మారింది. సొంత పార్టీ పెట్టి ప్రస్తుత మున్న పరిస్థితుల్లో నెట్టుకురావడం చాలా కష్టం.

స్పేస్ ఉందా?

తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా రాజకీయ శూన్యత లేదు. ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కోలుకోలేదని ఖచ్చితంగా చెప్పలేం. ఉన్నట్లుండి కాంగ్రెస్ పుంజుకున్నా పెద్దగా ఆశ్చర్యం పడాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారైనా ప్రజలు అవకాశమిస్తారన్న ఆశ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా క్రమంగా తన బలం పెంచుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

వైఎస్ ఓటు బ్యాంకు ఉందా?

వైఎస్ షర్మిల తనకు తాను తెలంగాణ బిడ్డగా చెప్పుకునేందుకు ప్రయత్నించినా ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తారు? ఒక వైపు పొరుగు రాష్ట్రంలో అన్న జగన్ అధికారంలో ఉన్నారు. జగన్ ను కాదని పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు షర్మిల పార్టీని ఆదరించే అవకాశముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఎన్నికల్లోనే వైసీపీకి కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది. వైఎస్ పై అభిమానముంటే ఆరోజే పెద్ద సంఖ్యలో వైసీపీ సీట్లు సాధించేది.

రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే?

ఇప్పుడు వైఎస్ షర్మిల తాను సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ ను ఉద్ధరిస్తారంటే ఎంతవరకూ జనం నమ్ముతారు? ఇక వైఎస్ షర్మిల తన ప్రసంగంలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇది వినడానికి బాగానే ఉన్నా ప్రస్తతమున్న పరిస్థితుల్లో వైఎస్ కు అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును షర్మిల తన వైపునకు తిప్పుకునేందుకు ఛాన్స్ ఉండదంటున్నారు. అయితే ఒక్కటి చెప్పొచ్చు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టి తాను అధికారంలోకి రాలేకపోయినా కొన్ని పార్టీలను పవర్ కు దూరంచేసే అవకాశాలు మాత్రం కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News