నాడు బైబై బాబు…. నేడు బైబై జ‌గ‌నా .. ఇదేంటి ష‌ర్మిలా ?

రాజ‌కీయాల్లోకి ప్రత్యక్షంగా రాక‌పోయినా.. ప్రత్యక్ష రాజ‌కీయాల‌ను ప్రభావితం చేసిన చ‌రిత్ర దివంగ‌త వైఎస్ కుమార్తె ష‌ర్మిల సొంతం చేసుకున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న అన్న [more]

Update: 2021-03-08 13:30 GMT

రాజ‌కీయాల్లోకి ప్రత్యక్షంగా రాక‌పోయినా.. ప్రత్యక్ష రాజ‌కీయాల‌ను ప్రభావితం చేసిన చ‌రిత్ర దివంగ‌త వైఎస్ కుమార్తె ష‌ర్మిల సొంతం చేసుకున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న అన్న జ‌గ‌న్ స్తాపించిన వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అనేక రూపాల్లో వైఎస్ షర్మిల కృషి చేశారు. పాద‌యాత్ర చేశారు. సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేశారు. ఇలా అనేక రూపాల్లో జ‌గ‌న్ కోసం ష‌ర్మిల చ‌మ‌టోడ్చారు. ఇక‌, ఈ స‌మ‌యాల్లోనే ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీపై గ‌ట్టిగానే విమ‌ర్శలు గుప్పించారు. 2012 ఉప ఎన్నిక‌ల్లోనే అన్న జైల్లో ఉంటే పార్టీ అభ్యర్థుల త‌ర‌పున ప్రచారం చేసి గెలిపించిన వైఎస్ షర్మిల 2014 త‌ర్వాత సైలెంట్ అయినా 2019 ఎన్నిక‌ల‌కు ముందు మళ్లీ జ‌నాల్లోకి వ‌చ్చారు.

ఆ స్లోగన్ వైరల్ అయి…..

మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో మాస్‌ను ఆక‌ర్షించేందుకు టీడీపీ అధినేత‌ చంద్రబాబును ఉద్దేశించి బై బాబు.. బైబై బాబు!! అనే స్లోగ‌న్‌ను వైఎస్ షర్మిల త‌న ప‌ర్యట‌న‌లో జోరుగా వినిపించారు. వాస్తవానికి ఒక‌వైపు టీడీపీ జై బాబు.. జైజై బాబు అంటే.. ష‌ర్మిల మాత్రం బై బాబు.. అనే నినాదాన్ని వినిపించారు. ఇది ప్రజ‌ల్లోకి బాగానే వెళ్లింది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు వైఎస్ షర్మిల సాయం చేశారు. అన్న వ‌దిలిన బాణంగా ఆమె ముందుకు వ‌చ్చారు.

అన్నతోనే ఢీకొంటానంటూ…

అయితే.. ఇప్పుడు ఇదే వైఎస్ షర్మిల తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెడుతున్నారు. ఈ క్రమంలో త‌న అన్నకు ఈ పార్టీ ఇష్టం లేద‌ని.. ప్రక‌టించిన ఆమె.. తాను తెలంగాణ ప్రజ‌ల అభివృద్ధి కోసం.. తెలంగాణ కోడ‌లిగా ఈ పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణ ప్రజ‌ల అభివృద్ధి కోసం.. త‌న అన్న ఏపీ సీఎం జ‌గ‌న్‌తోనూ ఢీ కొంటాన‌ని ప్రక‌టించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. వైఎస్ షర్మిల గ‌తంలో బై బాబు.. అంటే.. ఇప్పుడు బై జ‌గ‌న్ .. బైబై జ‌గ‌న్ అనే నినాదాన్ని ఎన్నుకుందా ? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వేర్వేరుగా అన్నా చెల్లెళ్లు….

ప్రస్తుతం రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎవ‌రు ? అనే మాట వినిప‌స్తూనే ఉంటుంది. అన్నద‌మ్ములు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ల‌ప‌డిన సంద‌ర్భాలు.. తండ్రీ కూతుళ్లు ఒకే చోట ప్రత్య‌ర్థులుగా ఉండడం.. చివ‌ర‌కు భార్యా భ‌ర్తలు కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న చ‌రిత్ర మ‌న తెలుగు రాజ‌కీయాల్లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల రాజ‌కీయం స‌రికొత్త ట్రెండు సృష్టిస్తుందేమో చూడాలి. ఏదేమైనా.. బై జ‌గ‌న్‌.. బైబై జ‌గ‌న్‌.. నినాదం.. వైఎస్ షర్మిలను ఎంత వ‌ర‌కు గెలిపిస్తుందో గాని అన్నా, చెల్లెల్లు వేర్వేరు రాష్ట్రాలు… రెండు పార్టీల రాజ‌కీయం చూసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.

Tags:    

Similar News