కంచుకోటను కొట్టేద్దామనేనా…?

మహ్మద్ ఇక్బాల్. మాజీ ఐజీ. రాయలసీమలోనే ఐజీగా పనిచేసిన మహ్మద్ ఇక్బాల్ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ హిందూపురం అసెంబ్లీ సీటును [more]

Update: 2019-08-12 08:00 GMT

మహ్మద్ ఇక్బాల్. మాజీ ఐజీ. రాయలసీమలోనే ఐజీగా పనిచేసిన మహ్మద్ ఇక్బాల్ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ హిందూపురం అసెంబ్లీ సీటును కేటాయించారు. హిందూపురంలో బలమైన టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష‌్ణ ఉన్నారు. పైగా హిందూపురం టీడీపీకి, నందమూరి కుటుంబానికి కంచుకోట. ఇప్పటి వరకూ అక్కడ తెలుగుదేశం పార్టీదే గెలుపు. అయితే నందమూరి బాలకృష‌్ణను ఓడించేందుకు మహ్మద్ ఇక్బాల్ ను చివరి నిమిషంలో రంగంలోకి దింపినా ఫలితం లేదు. రాష్ట్రమంతటా బలమైన గాలులు వీచినా హిందూపురంలో మాత్రం ఓటమి చవిచూడక తప్పలేదు.

ఎన్నాళ్లుగా పార్టీలోనే ఉన్నా…..

హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేత నవీన్ నిశ్చల్ ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకుని ఉండారు. పార్టీకి దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఇన్ ఛార్జిగా కూడా వ్యవహరించారు. తనకే టిక్కెట్ అన్న ధీమాతో ఉన్న నవీన్ నిశ్చల్ కు జగన్ ఝలక్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. మరోవైపు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని కూడా జగన్ పార్టీలో చేర్చుకున్నారు. రెండు వర్గాలుగా వైసీపీ హిందూపురంలో మారడంతో ఆఖరు క్షణంలో జగన్ మహ్మద్ ఇక్బాల్ వైపు మొగ్గు చూపారు.

ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ….

ఎన్నికల ఫలితాల తర్వాత ముస్లింలకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రిగా ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిశ్చయించారు. ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావించారు. అయినా ఏడాది క్రితమే మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వననున్నట్లు జగన్ బహిరంగంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన మూడు స్థానాల్లో మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి జగన్ ఇస్తారని ఊహించలేదు.

భవిష‌్యత్తును దృష్టిలో పెట్టుకుని…..

కానీ జగన్ మాత్రం చెప్పినట్లుగానే మహ్మద్ ఇక్బాల్ ను ఎమ్మెల్సీ గా ఖరారు చేశారు. బాలకృష్ణ ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించికపోయినా ఆయన పట్ల జగన్ కు నమ్మకం ఉందంటున్నారు. ఇక్బాల్ అహ్మద్ ను వైసీీపీ నేతలే ఓడించారన్న సమాచారం మేరకు జగన్ మహ్మద్ ఇక్బాల్ ను ఎంపిక చేశారు. అంతేకాకుండా మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న సంకేతాలు పంపడానికి కూడా మహ్మద్ ఎంపిక కూడా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద మాజీ ఐజీ మహ్మద్ ఇక్బాల్ ఎంపిక జగన్ వ్యూహాత్మకంగానే చేశారంటున్నారు. భవిష్యత్తులో హిందూపురం నియోజకవర్గాన్ని సొంతం చేసేందుకు ఈ ఎంపిక దోహదపడుతుందన్నది జగన్ ఆలోచన.

Tags:    

Similar News