అన్నింటికీ రాం..రాం

అధికారంలోకి వ‌చ్చిన వెంటనే జగన్ టీడీపీ సర్కార్ విధానాలను తిరగతోడడం కామన్ పాయింట్ గా పెట్టుకున్నారు. మొత్తానికి మొత్తం పాలనలో తనదైన ముద్ర ఉండాలన్నది జగన్ ఆలోచనగా [more]

Update: 2019-10-31 05:00 GMT

అధికారంలోకి వ‌చ్చిన వెంటనే జగన్ టీడీపీ సర్కార్ విధానాలను తిరగతోడడం కామన్ పాయింట్ గా పెట్టుకున్నారు. మొత్తానికి మొత్తం పాలనలో తనదైన ముద్ర ఉండాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ అస్మదీయులకు కట్టబెడుతూ చేసిన పలు అవినీతి కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది జగన్ టార్గెట్. ఈ విషయంలో ఆయన ఎవరేమనుకున్నా దూకుడుగానే ముందుకు పోతున్నారు. అమరావతి, పోలవరం జగన్ బిగ్ టాస్క్ లు. అందుకే వాటిని అలా ఉంచి ముందు సంక్షేమ పధకాల పందేరం కానిచ్చేస్తున్నారు. పోలవరం కాంట్రాక్టుల నుంచి నవయుగ ను తప్పించేసిన జగన్ బందర్ పోర్ట్ కూడా నవయుగ నుంచి లాగేసి కధ కంచికి చేర్చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆరు నెలల పాలనకు దగ్గర పడుతున్న క్రమంలో జగన్ ఇపుడు అమరావతి మీద పూర్తి దృష్టి పెట్టారు.

ఒప్పందం రద్దు…..

సింగపూర్ కన్సార్టియం అంటే టీడీపీ సర్కార్ కి మహా ప్రియం. అందుకే రైతుల నుంచి అప్పనంగా సేకరించిన వేల ఎకరాల్లోంచి 1691 ఎకరాలను వారికి చేతుల్లో పెట్టి అభివృధ్ధి చేయమని ఒప్పందం చేసుకుంది. ఇలా చేసినందుకు గానూ వారికి వందల ఎకరాలు కూడా ధారాదత్తం చేసే పధకం కూడా ఉంది. మరో వైపు డెవలెప్ మెంట్ లో భాగంగా స్థలాలు, ఫ్లాట్లు అమ్ముకునే సదుపాయం కూడా కల్పించారు. సరే సింగపూర్ కన్సార్టియం కోర్ కాపిటల్ నిర్మించాలి. అందులో అసెంబ్లీ, రాజ్ భవన్, ముఖ్యమంత్రి ఆఫీస్, సచివాలాయం వంటివి నిర్మించాల్సి ఉంది. దాని కంటే ముందు టౌన్ షిప్పులను అభివృధ్ధి చేయమని గత సర్కార్ కోరింది. అలాగే ఒప్పందం కుదిరింది. ఐతే ఇది అతి భారీ ఖర్చు వ్యవహారమని జగన్ సర్కార్ భావిస్తోంది. పైగా చదరపు అడుగుకు పది వేల రూపాయలు మొత్తం అంటే ఏపీ సర్కార్ కుదేలని కూడా జగన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఒప్పందం రద్దుకే సుముఖంగా ఉన్నారని అంటున్నారు.

నో అంటున్న సింగపూర్….

ఈ మేరకు పాత ఒప్పందం రద్దు చేసుంటున్నట్లుగా జగన్ సర్కార్ సింగపూర్ కన్సార్టియంకి శుభవర్తమానం పంపించింది. ఒకవేళ ఆసక్తి ఉంటే కొత్తగా ఒప్పందం చేసుకునేందుకు రావాలని కూడా అహ్వానించింది. ఈ భోగట్టాను ఇంతకు ముందే సింగపూర్ టూర్లో ఆర్ధిక మంత్రి కన్సార్టియం ప్రతినిధులకు విపులంగా వివరించారు. అయితే జగన్ సర్కార్ తో ముందుకు వెళ్ళడం తమకు ఇష్టం లేదని ఆ ప్రతినిధులు అంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ లండన్ కోర్టులో కేసుని కూడా ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయస్థానంలోకి వెళ్తున్నట్లుగా ఉంది. మరి జగన్ ఎలాగైనా ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే సిధ్ధపడుతున్న క్రమంలో ఇదొక రాజకీయ ఆయుధంగా టీడీపీ మార్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అమరావతి అంటూ గుండెలు బాదుకున్న టీడీపీకి ఇపుడు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడంలేదట.

Tags:    

Similar News