అలా చేస్తే కొత్త రికార్డే

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక దుస్థితి నుంచి గట్టెక్కాలంటే పరిశ్రమలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అవి రెండు జరగాలంటే పారిశ్రామిక ప్రోత్సహకాలు అటు కేంద్రం , ఇటు రాష్ట్రం [more]

Update: 2019-08-09 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక దుస్థితి నుంచి గట్టెక్కాలంటే పరిశ్రమలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అవి రెండు జరగాలంటే పారిశ్రామిక ప్రోత్సహకాలు అటు కేంద్రం , ఇటు రాష్ట్రం ఇవ్వాలి. కేంద్రం నుంచి వస్తున్న సాయం ఎండమావిలాగే కనిపిస్తుంది. గుజరాత్ పై పెట్టిన ఫోకస్ మోడీ సర్కార్ దేశంలో మరే ఇతర రాష్ట్రం పై చేయడం లేదని గత ఐదేళ్ళలో తేలిపోయింది. తాజాగా కూడా పూర్తి మెజారిటీతో కేంద్రంలో సుస్థిరంగా వున్న బిజెపి రాష్ట్రాలు కోరినట్లు ఆర్ధిక సాయం అందించేందుకు ఉదారంగా ముందుకు రావడం ఇప్పట్లో జరిగేలా లేదు.

జగన్ సర్కార్ కి సవాల్ ….

దీంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజారిటీతో ఏర్పడ్డ జగన్ సర్కార్ కి పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడం ప్రధాన సవాల్ గా మారింది. గతంలో ఐదేళ్ళు టిడిపి సర్కార్ కి ఈ అంశంలో హడావిడి ఎక్కువ పని తక్కువ అనే విమర్శనే ఎదుర్కొంది. లక్షలకోట్ల రూపాయలతో పరిశ్రమలు ఎపి లో పెట్టుబడులు పెట్టేస్తున్నాయంటూ హల్చల్ చేసి తీరా కార్యాచరణలో అవేమి కనిపించక ఘోరఓటమి చవిచూసింది. చెప్పుకోవడానికి కియా పరిశ్రమే ఇప్పుడు టిడిపి కి మిగిలింది. ఈనేపధ్యంలో వచ్చే ఐదేళ్ళు లోపు పరిశ్రమలు ఉపాధి అవకాశాలు లేని పక్షంలో వైసిపి సర్కార్ కి జనం చుక్కలు చూపించేస్తారన్న క్లారిటీ వుంది. దాంతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటినుంచి ఏపీని పారిశ్రామికీకరణ దిశగా బలంగా అడుగులు వేస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా ….

అమరావతి కేంద్రంగా ఇప్పుడు విదేశీ భాగస్వామ్య సదస్సు ను ఏర్పాటు చేస్తుంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వం మాదిరిగా పెట్టుబడులు – ఒప్పందాలు అనే హడావిడి ఎంఓయులంటూ ప్రచార ఆర్భాటాలకు పోకుండా వినూత్న ఆలోచన తెచ్చింది. సుమారు 30 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించి ఎపి లో పరిశ్రమల స్థాపనకు వున్న అవకాశాలను సదస్సులో వారి దృష్టికి తేవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 13 దేశాల రాయబారులతో నేరుగా ఎపి ముఖ్యమంత్రి ముఖాముఖీ జరపనుండటం విశేషం. ఇలా ఈ స్థాయిలో విదేశీ రాయబార ప్రతినిధులతో ఏ రాష్ట్రం ఈ స్థాయిలో దేశంలో చర్చలు జరిపింది లేకపోవడంతో జగన్ కొత్త రికార్డ్ సృష్ట్టించినట్లే.

ప్రయత్నం మంచిదే…..

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూకే, ఆస్ట్రేలియా సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. నవరత్నాల కార్యక్రమాలపై కూడా వీరికి ఇందులో అవగాహన కల్పించనున్నారు. ఎంఓయుల పేరుతోఒప్పందాలు చేసుకుని భూములు కట్టబెట్టిన తరువాత ఆయా కంపెనీలు పరిశ్రమలు స్థాపించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు దిగడం రివాజుగా వస్తుండటంతో ఈసారి జగన్ సర్కార్ ముందుగా ఎపి పై అవగాహన కల్పించి వాస్తవంగా పరిశ్రమలు పెట్టేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని భావిస్తుంది. చూడాలి ఈ ప్రయత్నం ఎంతమేరకు విజయవంతం అవుతుందో మరి.

Tags:    

Similar News