జగన్ నిఘాలో ఉన్న సీనియర్ మంత్రి ఎవరు…?

జగన్ ఒకే మాట చెబుతున్నారు. అవినీతి రహిత పాలన నా లక్ష్యం. ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు అని. మంత్రి పదవులు ఇస్తూనే [more]

Update: 2019-07-15 13:30 GMT

జగన్ ఒకే మాట చెబుతున్నారు. అవినీతి రహిత పాలన నా లక్ష్యం. ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు అని. మంత్రి పదవులు ఇస్తూనే జగన్ ఘాటు హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అయితే అలవాట్లో పొరపాటుగా కొందరు మంత్రులు కొంత చేతివాటం చూపించారని, బదిలీల్లో లీలలు చేశారని జగన్ చెవికే మొత్తం కధ చేరిపోయింది. దాంతో జగన్ అయిదుగురు మంత్రులను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. వారి పేర్లు ఇప్పటికీ బయటకు రాకపోయినా అందులో ఒకరు ఓ సీనియర్ మంత్రి, జగన్ తండ్రి వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన నేత అని చూచాయగా చెబుతున్నారు. మరి ఎవరు ఆ మంత్రి గారు అన్నదే ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది.

ఆ అయిదుగురులో ఎవరు…..

జగన్ క్యాబినేట్లో అయిదుగురు మంత్రులు ఆయన తండ్రి వైఎస్సార్ దగ్గర కూడా పనిచేనిన వారున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ ఇపుడు జగన్ క్యాబినెట్లో కూడా కొనసాగుతున్నారు. వీరిలో జగన్ సీరియస్ అయినట్లుగా ప్రచారంలో ఉన్నమంత్రి ఎవరు అన్నదే పెద్ద చర్చ. ఐతే ఆ సీనియర్ మంత్రి తన సొంత జిల్లాలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్నారట. తన బలం చూపించి అధికార హవా చాటుతున్నరట. అలా చూసుకుంటే ఈ పోలికలకు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు అసలు కుదరదు. వారు సొంతంగానే తమ సీట్లో గెలవలేకపోయారు.

ఆయనేన‌ని డౌట్…..

ఇక మిగిలిన ముగ్గురు మంత్రుల్లో పెద్దిరెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు, ఆయన కొడుకు మిధున్ రెడ్డి కి లోక్ సభలో పార్టీ నేతగా ఇచ్చి జగన్ తన అభిమానం చాటుకున్నారు. బాలినేని జగన్ దగ్గర చుట్టం. జగన్ మాటే ఆయన మాట. మరి మూడవ వారు బొత్స, పోలికకు బాగా దగ్గర ఉన్న పేరు ఇదే. సొంత జిల్లా విజయనగరంలో బొత్స హవాయే వేరు. ఆయన బంధుగణం బలం చూసుకుని కూడా దూకుడుగా ఉంటారంటారు. మరి జగన్ బొత్సను ఉద్దెశించా సీరియస్ అయిందన్న మాట ఇపుడు ఉత్తరాంధ్ర అంతటా వినిపిస్తోంది. అదే జరిగితే బొత్స రాజకీయ దూకుడుకు అడ్డుకట్ట పడిపోవడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో.

Tags:    

Similar News