జగన్ ఎందుకు వింటారు

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏపీలో ఉన్న వైసీపీని కట్టడి చేయాలని చూస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి లేదని ధాటిగా పెద్దల సభలోనే జలవరనుల శాఖామంత్రి గజేంద్రనాధ్ షెకావత్ [more]

Update: 2019-07-17 13:30 GMT

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏపీలో ఉన్న వైసీపీని కట్టడి చేయాలని చూస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి లేదని ధాటిగా పెద్దల సభలోనే జలవరనుల శాఖామంత్రి గజేంద్రనాధ్ షెకావత్ కుండబద్దలు కొట్టారు. అది చాలదా ఏపీలో చంద్రబాబు చెలరేగిపోవడానికి. మా ప్రభుత్వంలో అవినీతి లేదు, జగన్ వెంట పడుతున్నాడంటూ బాబు గట్టిగానే జగన్ పై సెటైర్లు వేశారు. ఇక విద్యుతు ఒప్పందాల విషయంలో తీసుకుంటే ఇప్పటికి రెండు సార్లుగా కేంద్రం బ్రేకులు వేస్తోంది. మొదిటిసారి అధికారుల స్థాయిలో లేఖ రాసినా జగన్ లెక్కచేయకపోవడంతో ఈసారి సంబంధిత మంత్రి డైరెక్ట్ గానే జగన్ కి లెటర్ రాసి వాటిని ముట్టుకోవద్దు అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. మరి ఇక్కడ సీఎం జగన్. ఆయన మనసులో పుట్టాలే కానీ మాట వింటారా. అందుకే జగన్ తనదైన శైలిలో కేంద్రానికి ఘాటుగా రిప్లై ఇప్పించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లాంతో మీడియా మీటింగ్ పెట్టించి మరీ మోడీ సర్కార్ కి ఏపీతో ఏం పని అని ఇండైరెక్ట్ గానే ఝలక్ ఇచ్చేశారు.

మీరు చేసినపుడు కాదా…..

ఇక అజేయకల్లాం మాట్లాడుతూ 2,400 మెగావాట్ల ఒప్పందాన్ని సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ విషయంలో కేంద్రం ఎందుకు రద్దు చేసిందని గట్టిగానే ప్రశ్నించారు. . తాము సమీక్ష చేయాలనుకుంటున్నది ప్రజల మీద భారం మోపడానికి చేసిన అడ్డగోలు అవినీతిని బయటపెట్టడానికేనని ఆయన చెప్పడం ద్వారా మోడీ స‌ర్కార్ కి బాగానే డోస్ ఇచ్చేశారు. ఇక సమీక్షలు వద్దు అనుకుంటే ఏ ఒప్పందమైనా, ఎంత కానిదైనా అమలు కావాల్సిందేనా అంటూ ఆయన ఓ విలువైన ప్రశ్నను కూడా సంధించారు. అంటే ఓ విధంగా మోడీకి, కేంద్రానికి అజేయ కల్లాం ద్వారా జగన్ తాను చెప్పాల్సింది చెప్పేశారన్న మాట.

లేఖ రాయనున్న జగన్…..

ఇపుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఇంధన శాఖా మంత్రికి లేఖ రాయనున్నారట. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పునస్సమీక్ష చేస్తామని అందులో ఖరాఖండీగా చెప్పదలచుకున్నారన్న మాట. నిజమే కదా కేంద్రంలో ఉన్న వారు తమ పాలన సంగతి చూసుకోకుండా సామంత రాజుల పాలన మాదిరిగా ఒక రాష్ట్రం విషయంలో వేలు పెడుతూంటే జగన్ లాంటి వారు ఎలా ఊరుకుంటారు, అందుకే ఘాటుగా బదులిచ్చారు. ఇక అన్నీ అవినీతి అంటూ నిన్నటి దాకా గర్జించిన కమలనాధులకు ఇపుడు అక్కడ నీతి ఎలా కనిపిస్తోదన్న మాట కూడా జగన్ ధిక్కారం వెనక ఉందని అంటున్నారు. పోలవరానికి క్లీన్ చిట్ ఇచ్చేసిన బీజేపీ ఇపుడు జగన్ మీదకు యుధ్ధానికి రావడాన్ని ఆయన రాజకీయ ఎత్తులాగానే చూస్తున్నారంటున్నారు. అందుకే ఆయన తనదైన శైలిలో నా పాలన నా ఇష్టమంటున్నారు.

Tags:    

Similar News