జగన్ పై ప్రెషర్ పెడుతుంది వారేనా?

జగన్ ఎవరికీ లొంగరని అంటారు. ఆయన వైసీపీ అధ్యక్షుడు కాక ముందు కాంగ్రెస్ లో ఎంపీ. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఎంపీగా మూడు నెలలు మాత్రమే [more]

Update: 2019-08-16 08:00 GMT

జగన్ ఎవరికీ లొంగరని అంటారు. ఆయన వైసీపీ అధ్యక్షుడు కాక ముందు కాంగ్రెస్ లో ఎంపీ. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఎంపీగా మూడు నెలలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత జగన్ ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళు కొనసాగారు. ఆ సమయంలో జగన్ మీద రకరకాల ఒత్తిళ్ళు వచ్చాయి. ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారు సైతం జగన్ మీద విమర్శలు చేసేవారు. ప్రత్యేకంగా జగన్ తిట్టేందుకే మంత్రి పదవులు కూడా కొందరికి ఆనాడు కాంగ్రెస్ హై కమాండ్ ఇచ్చింది. మరో వైపు కేంద్రం జగన్ మీద ఉచ్చు బిగిస్తూనే దారికి తెచ్చుకోవాలని చూసింది. ఇంత జరిగినా కూడా జగన్ ఎక్కడా బెదరలేదు, వెనకడుకు వేయలేదు. ఆయన అనుకున్నట్లుగానే ముందుకు పోయారు, చివరకు జైలుకు కూడా వెళ్ళారు. పదేళ్ళ పోరాటం తరువాత ముఖ్యమంత్రి అయ్యారు.

సీఎం హోదాలో ఉండగా…

ఇపుడు జగన్ సీఎం హోదాలో పూర్తిగా అధికారాలు అనుభవిస్తున్నారు. ఆయన తనదనుకున్న పాలన చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో రెండవ ఆలోచనకు ఎక్కడా తావు కూడా లేదు. కానీ ఇపుడు జగన్ మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో మాట్లాడుతూ తన మీద వత్తిళ్లు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి మీద వత్తిళ్ళు రావడం జాతీయ పార్టీల్లో అయితే కుదురుతుంది. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. మరి ఆయన మీద వత్తిడి ఎందుకు ఉంటుంది. అంటే ఉంటుంది ఇపుడు ఏపీ కష్టాల్లో ఉంది, కేంద్రంలో బీజేపీ సహాయ సహకారాలు లేకపోతే ఏపీ బండి నడవదు, అందువల్ల ఆ వైపు నుంచి నరుక్కువచ్చే వత్తిళ్లు ఉంటాయని రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయం. అదే జగన్ చెప్పకుండా చెప్పారనుకోవాలి. జగన్ ఆ మధ్యన ఢిల్లీలి వెళ్ళినపుడు కూడా అక్కడ లాబీయింగ్ చేసేందుకు ఓ బృందం కాచుకుని కూర్చుందని వార్తలు వచ్చాయి. జగన్ ఎవరి మాటా వినరు. అందువల్ల నయానా కాకపోతే భయానా అయినా ఆయన మీద వత్తిడి తేవాలనుకుంటున్నట్లుగా కధనాలు వచ్చాయి.

విద్యుత్ షాక్ తగిలేది ఎవరికి?

జగన్ పాత టీడీపీ సర్కార్ పాపాలు కడుతున్నారు. ఒక్కోటి విషయాలు వెలుగు చూసేలా చేస్తున్నారు. ప్రతీ ప్రాజెక్ట్ లోనూ అవినీతి ఉందని జగన్ అంటున్నారు. ఎక్కడికక్కడ కమిషన్ల రూపంలో వేలకోట్ల ప్రజా ధనం వృధా అయిందని జగన్ గట్టి భావన. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం చూస్తే జగన్ సీరియస్ గానే ఉన్నారు. అడ్డగోలు రేట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఏపీ ఖజానాపై ఏకంగా 20 వేల కోట్ల పెను భారం పడుతోందని అంటున్నారు. పెద రాష్ట్రం ఇది భరించలేదు. ఏపీకి వేరేగా నిధులు కూడా రావు, లేవు, అందుకే జగన్ మరో పద్ధతిలో అవినీతిని ఆపి సొమ్ముకు జమ చేయాలనుకుంటున్నారు. ఇక రివర్స్ టెండరింగ్ కూడా అలాంటిదే. దీని వల్ల బాగుపడింది టీడీపీ తమ్ముళ్లే. దాంతో పాత కాంట్రాక్టులను రద్దు చేయాలనుకోవడంలో తప్పులేదు. జగన్ ఆ పని చేయనీయకుండా వత్తిళ్ళు వస్తున్నాయన్నది నిజమే. చీకటి శక్తులు కూడా పనిచేస్తున్నాయి. అక్కడ పార్టీలు లేవు, కులాలు, ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ వత్తిళ్ళను దాటుకుని జగన్ ఎలా ముందుకు వెళ్తరో చూడాలి.

Tags:    

Similar News