జగన్ ఇమేజ్ ఏందో అప్పడు కాని తేలదట

నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే అది జగన్ పాలనకు రెఫరెండంగానే భావించాలి. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నో సంక్షేమ [more]

Update: 2020-07-09 15:30 GMT

నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే అది జగన్ పాలనకు రెఫరెండంగానే భావించాలి. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలను ఏపీలో జగన్ గ్రౌండ్ చేశారు. దాదాపు 28 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో పేదలకు పంచిపెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ సంక్షేమ కార్యక్రమాలకు, మ్యానిఫేస్టోలో, పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలకే ప్రాధాన్యత ఇచ్చారు జగన్.

అధికార పార్టీ వైపు….

స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతుంటారు. అసెంబ్లీ ఉప ఎన్నికలయినా అధికార పార్టీకి అడ్వాంటేజీగా ఉంటుంది. అయితే పార్లమెంటు ఎన్నికలు మాత్రం ప్రజల నాడిని పట్టుకోలేం. అందుకు అనేక నియోజకవర్గాల్లో అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. ఏడు శాససభ నియోజకవర్గంలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే ఉప ఎన్నిక ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరును అద్దం పడుతోంది.

వారిపై ఉన్న వ్యతిరేకత…..

నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిపై ఉన్న వ్యతిరేకత కావచ్చు, గత ఏడాదిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ ఎన్నికపై ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని రఘురామకృ‌‌ష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా జ్ఞప్తికి వస్తాయి. అంటే ఉప ఎన్నికలో గెలుపోటములను బట్టి జగన్ ఇమేజ్ ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం.

గెలవకపోతే ఇమేజ్….

అందుకే నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే జగన్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంటుంది. ఫలితాలు తారుమారైతే వైసీపీలో అనేకమంది రాజులు బయలుదేరే ప్రమాదం ఉంది. అందుకే ఉప ఎన్నిక వస్తే జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారన్నది వాస్తవం. గోకరాజు కుటుంబాన్ని బరిలోకి దింపినా అక్కడ జనసేన, బీజేపీ లోపాయికారీగా టీడీపీ కలిస్తే జగన్ కు మాత్రం సినిమా కనపడటం ఖాయమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద నర్సాపురం పార్లమెంటుకు ఉప ఎన్నిక అంటూ వస్తే గెలుపు పైనే జగన్ నాలుగేళ్ల పాలన ఆధారపడి ఉంటుందన్నారు.

Tags:    

Similar News