సరంజామా సిద్ధమటగా..!!

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం ముంచుకు వ‌స్తోంది. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ అధికారాన్ని [more]

Update: 2019-09-23 02:00 GMT

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం ముంచుకు వ‌స్తోంది. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ అధికారాన్ని అందిపుచ్చుకుంది. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో చాలా జిల్లాల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక మ‌ధ్య‌లో జ‌రిగిన కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను సైతం అధికార బ‌లంతో గెలుచుకుంది. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. స్థానిక సంస్థ‌ల్లో స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఏడాది నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈలోగానే వాటికి సంబంధించిన స‌రంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇట‌వలే.. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు.

వలంటీర్ వ్యవస్థను….

ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఊపు త‌గ్గ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న జగన్ స్థానిక సంస్థ‌ల్లో కూడా అదే త‌ర‌హా విజ‌యానికి సిద్ధ‌మైన‌ట్టు చెప్పుకొచ్చారు. దీనికి గాను కొన్నిలక్ష్యాల‌ను ఏర్పాటు చేసుకున్నారు. లోక‌ల్ బాడీలో స‌త్తా చాటిన నాయ‌కుల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోనూ త‌న పార్టీపై మ‌రింత మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టేందుకు జగన్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామ స్వ‌రాజ్యానికి పెద్ద‌పీట వేశారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా.. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధుల్లా ఉండేలా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించుకుని ఆదిశ‌గానే అడుగులు వేశారు.

గ్రామ సచివాలయ వ్యవస్థను….

ఇప్పుడు ఈ నెల ఆఖ‌రులోగా గ్రామ స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌ను కూడా పూర్తి చేశారు. మేనిఫెస్టోకు జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌తి విష‌యంలో నూ నిజాయితీగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం నుంచి ఏదైనా ల‌బ్ధి జ‌రిగేలా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక వీలుంటే స్థానిక ఎన్నిక‌ల్లో ముందుగా విశాఖ గ్రేట‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించాక మిగిలిన ఎన్నిక‌ల‌ను వ‌రుస పెట్టి నిర్వ‌హించాల‌ని జగన్ చూస్తున్నారు.

టీడీపీ ఓటమికి….

పంచాయ‌తీల‌కు ఎప్పుడో ఏడాది క్రిత‌మే పాల‌క‌వ‌ర్గం ముగిసినా తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేదు. దీంతో స్థానిక పాల‌న గాడిత‌ప్ప‌డంతో కూడా ఆ పార్టీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టిగా ఉంది. మొత్తంగా చూస్తే.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ చాలా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వీటిలో స‌క్సెస్ కావ‌డంతో పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుని, అభ్య‌ర్థుల‌తో ప‌నిలేకుండా పార్టీకి బ‌ల‌మైన పునాదులు ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో ?చూడాలి.

Tags:    

Similar News