అంతా అనుకున్నట్లుగానే

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తన తండ్రి మాదిరిగా ఒకసారి ఎవరినైనా నమ్మితే ఆ విశ్వాసం కొనసాగిస్తారని అంటారు. అయితే చిన్న తేడా ఉంది. వైఎస్సార్ చూసీ చూడనట్లుగా [more]

Update: 2019-08-26 12:30 GMT

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తన తండ్రి మాదిరిగా ఒకసారి ఎవరినైనా నమ్మితే ఆ విశ్వాసం కొనసాగిస్తారని అంటారు. అయితే చిన్న తేడా ఉంది. వైఎస్సార్ చూసీ చూడనట్లుగా ఉంటారు. వై.ఎస్. జగన్ మాత్రం ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ ముందుకుసాగుతారు. అది చేదు అనుభవాలు ఆయనకు నేర్పిన పాఠాలు. ఇదిలా ఉండ‌గా గోదావరి జిల్లాల వరకూ వై.ఎస్. జగన్ కి ఎదురులేదు. గట్టి నాయకులు ఉన్నారు. ఉత్తరాంధ్ర మాత్రం వైసీపీకి ఎపుడూ కొరుకుడు పడని ప్రాంతం. దాంతో వై.ఎస్. జగన్ నాలుగు నెలల పాటు పాదయాత్ర చేసి మరీ ఆ మూడు జిల్లాలను ఒడిసిపట్టేశారు. స్థానిక నాయకుల కంటే కూడా వై.ఎస్. జగన్ కృషి, ఇమేజ్ వల్లనే ఇక్కడ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయని అంటారు. స్థానిక నాయకత్వం బలంగా ఉన్న చోట రికార్డు స్థాయి మెజారిటీలు రావడంతో పాటు స్వీప్ కూడా చేసిన జిల్లాగా విజయనగరం ఉంది. దానికి కారణం మూడు దశాబ్దాలుగా ఎదురులేని నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ. ఆయన జిల్లాలో తనదైన రాజకీయం చేస్తూ వచ్చారు. అది వై.ఎస్. జగన్ కి బాగా ప్లస్ అయింది. రాజులంతా ఓక వైపుకు వెళ్ళిపోయినా బొత్స మాత్రం సామాన్య ప్రజలను, వారి నాడిని పట్టుకున్నారు. అందుకే జిల్లాకు జిల్లా వైసీపీ పరమైంది.

బొత్సకు ప్రాధాన్యత….

జగన్ విదేశాల్లో ఉన్నపుడు పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా బొత్స సత్యనారాయణ రాజధానిపై స్టేట్ మెంట్ ఇచ్చారని అంతా అనుకున్నారు. బొత్స వివాదాస్పద ప్రకటనలతో వైసీపీని నిండా ముంచెస్తున్నారని కూడా భావించారు. అయితే అదంతా వట్టి ఊహ అని తేలిపోయింది. బొత్స ద్వారా వై.ఎస్. జగన్ తన మనసులోని మాటలను చెప్పించారని అంటున్నారు. ఉత్తరాంధ్ర నాయకుడు, బీసీ నేత, అదే వెనకబడిన జిల్లా నుంచే రాజధాని మార్పుపై ప్రకటన చేశారంటేనే ఎంత వ్యూహాత్మకంగా బొత్స ద్వారా వై.ఎస్. జగన్ కధ నడిపించారో అర్ధమవుతుంది. ఈ విధంగా బొత్సను వై.ఎస్. జగన్ నూటికి నూరు శాతం నమ్మారని అంటున్నారు. రాజధానిపై చేసిన ప్రకటనతో బొత్స ఇమేజ్ కూడా బాగా పెరిగింది. వై.ఎస్. జగన్ వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి కూడా అందరికీ అవగాహనకు వచ్చింది. పైగా జగన్ రాజధాని విషయంలో చేయబోయే అతి పెద్ద మార్పులకు బొత్స పూర్తి కీలకం అవుతారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ మంత్రి, సీనియర్ నేత కూడా.

విజయనగరం దశ తిరిగేనా..?

విజయనగరంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలని వై.ఎస్. జగన్ సూత్రప్రాయంగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ బోర్డులను కూడా విజయనగరం కేంద్రంగా నెలకొల్పుతారని అంటున్నారు. అదె జరిగితే బొత్స దశ తిరిగినట్లే. సీనియర్ మోస్ట్ లీడర్ గా అయన విజయనగరం నుంచి పొలిటికల్ గా చక్రం తిప్పే అవకాశం వస్తుంది. అంతే కాదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా విజయనగరం జిల్లా రోడ్లే అద్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా రాజధాని కేంద్రంగా ప్రకటింపచేస్తే మాత్రం బొత్స రాజకీయ మైలేజ్ కూడా బాగా పెరుగుతుంది. ఇక బొత్సను వై.ఎస్. జగన్ నమ్మడానికి మరో కారణం ఉత్తరాంధ్రలో బొత్సను మించిన రాజకీయ నేత మరొకరు లేకపోవడం, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు ఉన్నా ఆయన తన సీటు మాత్రమే గెలవగలరు తప్ప జిల్లా మొత్తంలో చక్రం తిప్పలేరు. పైగా బొత్సకు ఉన్న మాస్ ఇమేజ్ లేదు. అందుకే వై.ఎస్. జగన్ ఉత్తరాంధ్ర వరకూ బొత్సను కదపకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీనియర్ మంత్రిగా ఆయన సేవలు పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటున్నారుట. మంత్రిగా బొత్స పనితీరుకు వై.ఎస్. జగన్ వేసిన మార్కులుగా వీటిని చెబుతున్నారు. మొత్తానికి తండ్రీ కొడుకుల వద్ద పరపతి సంపాదించడం అంటే చిన్న విషయమేతే కాదు, బొత్స సామాన్యుడు కారని అంటున్నారంతా.

Tags:    

Similar News