ఆశలపై నీళ్లు చల్లినట్లేనా…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నారా..? అంటే అవుననే అనిపిస్తుంది. డిసెంబర్ వరకూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా? అన్నది [more]

Update: 2019-08-09 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నారా..? అంటే అవుననే అనిపిస్తుంది. డిసెంబర్ వరకూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా? అన్నది అనుమానంగానే ఉంది. ఎందుకంటే వచ్చే నెలలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలను కూడా డిసెంబరులోగా పూర్తి చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడనుంది.

జిల్లాల పెంపుదల….

స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాల పెంపు తర్వాత జరుపుదామని వైఎస్ జగన్ తొలుత భావించారు. మొత్తం 23 జిల్లాలకు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనపడటం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆర్థికంగా కొంత అదనపు భారం పడుతుంది. కొత్తగా అధికారులను కూడా కేటాయించాల్సి ఉంది. దీంతో జగన్ కొత్త జిల్లాల ఏర్పాటును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని….

ీదీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడే నిస్తేజంగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ క్యాడర్ కూడా పెద్దగా యాక్టివ్ గా లేదు. దీంతో త్వరగా స్థానిక సంస్థల ఎన్నిలకు వెళ్లాలని జగన్ యోచిస్తున్నారు. ఈ మేరకు అధికారులతో కసరత్తు చేశారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పోస్టులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే జగన్ భర్తీ చేస్తారని తెలుస్తోంది.

పదవులు తర్వాతే…..

వైఎస్ జగన్ ఈ వారంలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో పాటు సామాజిక కార్పొరేషన్ల పదవులను కూడా నింపాల్సి ఉంటుంది. అయితే జగన్ ఈనెల 15వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ముందే నామినేటెడ్ పోస్టులను జగన్ భర్తీ చేస్తారనుకున్నారు. అయితే స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడతుండటంతో అది పూర్తయిన తర్వాతే జగన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని తెలియడంతో వైసీపీ నేతలు ఊసూరుమంటున్నారు.

Tags:    

Similar News