వైసీపీలో కొత్త గోల..!!

విశాఖ జిల్లాలో అసలైన వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తీరని అన్యాయం జరుగుతోందని రగిలిపోతున్నారు. పదేళ్ళ పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు దక్కడంలేదని, నిన్న కాక [more]

Update: 2019-07-21 15:30 GMT

విశాఖ జిల్లాలో అసలైన వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తీరని అన్యాయం జరుగుతోందని రగిలిపోతున్నారు. పదేళ్ళ పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు దక్కడంలేదని, నిన్న కాక మొన్న చేరిన వారికే అందలాలు అందిస్తున్నారని గోడుమంటున్నారు. తాము తొమ్మిదేళ్ళ పాటు అష్టకష్టాలు పడి వైసీపీ కోసం పనిచేస్తే పక్కన పెట్టి మరీ ఫిరాయించి వచ్చిన నాయకులకు పదవులు ఇవ్వడమేంటని వారంతా ఆవేదన చెందుతున్నారు. జగన్ కాంగ్రెస్ ని వీడివచ్చినపుడు వెంట ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని కూడా గుర్తు చేస్తున్నారు. నాడు అధికారం అనుభవించిన వారికే ఇపుడు జగన్ పెద్ద పీట వేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు.

రెడీమేడ్ మంత్రిట….

జగన్ ఏరి కోరి తన క్యాబినెట్లోకి తీసుకున్న అవంతి శ్రీనివాసరావుని రెడీ మేడ్ మంత్రిగా వైసీనీ నేతలు పిలుస్తున్నారంటే ఎంతలా మండిపోతున్నారో అర్ధమవుతుంది. అవంతి ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలీ టికెట్ తెచ్చుకున్నారు. గెలవడం తోనే మంత్రి అయిపోయారు. ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీలో చేరి అధికారాన్ని అనుభవించి వచ్చిన వారు. జగన్ కష్టాల్లో ఉంటే ఆయన ఏనాడూ స్పందించలేదు.ఇక జగన్ కాంగ్రెస్ ని వీడిన టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. దాంతో అవంతి అధికార పార్టీలో అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీలో చేరి అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. ఇపుడు వైసీపీలో మంత్రిగా అధికారం అనుభవిస్తున్నారు. ఇదే ఇపుడు అసలైన వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉంది.

ఆయనా అంతేగా….

ఇక ఉత్తరాంధ్రాలోనే తొలి నామినేటెడ్ పదవిని జగన్ ద్రోణం రాజు శ్రీనివాస్ కి ఇచ్చారు. ఆయన కూడా ఎన్నికల ముందే వైసీపీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉండి జగన్ ని విమర్శించేవారని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక అయనకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు. అయినా కూడా ఆయన్ని పిలిచి మరీ అతి పెద్ద పోస్ట్ జగన్ ఇవ్వడంతో వైసీపీ నేతల ఆగ్రహం అంతా ఇంతా కాదు, తాము జగన్ వెంట నడిచి కష్టాలు, నష్టాలు పడ్డామని, ఇంతా చేస్తే కాని వాళ్ళమైపోయమా అని ఆవేదన చెందుతున్నారు. జగన్ నిజమైన వైసీపీ వారికి న్యాయం చేయకుండా రెడీ మేడ్ నేతలకు పదవులు ఇవ్వడమేంటని కూడా గుస్సా అవుతున్నారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, వంశీ క్రిష్ణ శ్రీనివాస్, కోలా గురువులు వంటి వారు అయితే తమ బాధను చెప్పలేక మింగలేక సతమనవుతున్నారు. మరి జగన్ ఇకనైనా ఇచ్చే పదవుల్లో అసలైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేస్తారేమో చూడాలి. లేకపోతే ఈ ఆవేదన దావానలంలా వ్యాపించి పెద్ద మంట అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Tags:    

Similar News