బాబు ట్రెండ్ నే జగన్ …?

రాజకీయాలను కులాల వారీగా వర్గీకరించిన ఘనత ఎవరిదో అందరికి తెలిసిందే. తనపై కానీ తన కుమారుడు లేదా పార్టీ పై ఏ కులస్థులు, ఏ మతస్థులు విమర్శించారో [more]

Update: 2019-09-16 13:30 GMT

రాజకీయాలను కులాల వారీగా వర్గీకరించిన ఘనత ఎవరిదో అందరికి తెలిసిందే. తనపై కానీ తన కుమారుడు లేదా పార్టీ పై ఏ కులస్థులు, ఏ మతస్థులు విమర్శించారో సరిగ్గా ఆ కులం టిడిపి నాయకులచేత మరింత ఘాటుగా విమర్శలు ఆరోపణలకు దింపేవారు చంద్రబాబు. అయితే గతంలో ఆ ట్రెండ్ ను స్వర్గీయ రాజశేఖర రెడ్డి మాత్రం పెద్దగా అనుసరించలేదు. ఆయన కోటరీలో మంచి మౌత్ గన్స్ ఉండటం తో టిడిపి చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టే దళం సీన్ లోకి వచ్చి తిట్టిన తిట్టు కాకుండా తిట్టేసి పోయేది. ఆ రాజకీయ విమర్శలు పెద్ద చర్చకు దారి తీసేవి. కానీ ఇప్పుడు వైసిపి అధినేత జగన్ టిడిపి అధినేత చంద్రబాబు ట్రెండ్ నే ఎంచుకున్నారు.

ముల్లును ముల్లుతో తీయాలనేనా …?

ముల్లును ముల్లుతోనే తీయాలని భావించారు వైఎస్ జగన్. నీవు నేర్పిన విద్యలే అన్న రీతిన ముఖ్యమంత్రి జగన్ తనపైనా పార్టీపైనా, ప్రభుత్వం పైనా వస్తున్న విమర్శలకు ఆరోపణలకు సమాధానం చెప్పిస్తున్నారు. అది టిడిపి కావొచ్చు జనసేన కావొచ్చు ఇదే ధోరణి ని వైసిపి అనుసరిస్తుంది. కమ్మ సామాజికవర్గం నాయకులు టిడిపి నుంచి మాట్లాడితే కొడాలి నాని సీన్ లోకి వస్తున్నారు. ఇక ఎస్సి సామాజికవర్గం నేతలు పసుపు పార్టీ నుంచి విమర్శిస్తే అదే వర్గానికి చెందిన నాయకులు నువ్వా నేనా అంటున్నారు.

పవన్ పై విమర్శలకు…..

అలాగే బిసి సామాజిక వర్గం వారు ఆరోపిస్తే ఆదే సెక్షన్ నుంచి దాడి మొదలు పెడుతున్నారు. మరీ గట్టిగా కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రూల్ అప్పుడప్పుడు పక్కన పెడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి వందరోజుల పాలనపై ధ్వజమెత్తారు. దాంతో ఆయనకు ఘాటు కౌంటర్ లు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా లను రంగంలోకి దింపేశారు జగన్. పవన్ ను వీరిద్దరూ దుమ్మెత్తిపోస్తూ తమ అధినేత పై ప్రశంసలు కురిపించడం తో బాబు మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News