ఇలాగైతే కుదరదన్నా

వైఎస్ జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అందుకు అనుగుణంగా అధికారులు, మంత్రులు మాత్రం వైఎస్ జగన్ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ క్యాబినెట్ లోని [more]

Update: 2019-08-13 09:30 GMT

వైఎస్ జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అందుకు అనుగుణంగా అధికారులు, మంత్రులు మాత్రం వైఎస్ జగన్ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ క్యాబినెట్ లోని మంత్రులు ప్రభుత్వం తీసుకున్న ప్రజోయోగమైన నిర్ణయాలను ప్రజల చెంతకు తీసుకెళ్లపోతున్నారు. తన అంచనాలను అందుకోలేకపోతున్న మంత్రులకు వైఎస్ జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఇలాగైతే కుదరదన్నా అని ముఖం మీదే కొందరి వద్ద వైఎస్ జగన్ అన్నట్లు తెలుస్తోంది.

జగన్ వేగానికి…..

వైఎస్ జగన్ వరసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 19 కీలక బిల్లులను ఆమోదించారు. అందులో బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లులున్నాయి. వాటిల్లో బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టు పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన మంత్రులు మాత్రం లైట్ గా తీసుకోవడం వైఎస్ జగన్ కు ఆగ్రహం కల్పించిందంటున్నారు.

సీనియర్ మంత్రిని అయితే….

మరో సీనియర్ మంత్రిని అయితే వైఎస్ జగన్ ఏకంగా వార్నింగ్ ఇచ్చేంతవరకూ వెళ్లినట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఈ సీనియర్ మంత్రి జిల్లాల రాజకీయాల్లో వేలుపెడుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పదవి విషయంలో జిల్లాకు చెందిన వైసీపీ నేతలకు కాదని తన సామాజిక వర్గానికి చెందిన నేతకు ఆ పదవి ఇవ్వాలని సీనియర్ మంత్రి ప్రయత్నించారు. దీంతో ఆ జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి సీనియర్ మంత్రిపై జగన్ కు ఫిర్యాదు చేయడంతో ఆయనపై జగన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

వరద సమయంలోనూ…..

“అన్నా మీరంటే గౌరవం. అలా అని ఇతర జిల్లాల్లో జోక్యం చేసుకుంటే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ప్రాంత నేతల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. ఇలాంటివి రిపీట్ కానివద్దన్నా” అని జగన్ సీరియస్ గానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల వరదల విషయంలోనూ మంత్రుల పనితీరు బాగాలేదని జగన్ భావిస్తున్నారు. సకాలంలో అక్కడికి చేరుకోకపోవడంపై జగన్ ఆ ప్రాంత మంత్రులపై మండిపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ కు తన టీం మీద క్రమంగా నమ్మకం సన్నగిల్లినట్లు కనపడుతోంది.

Tags:    

Similar News