జగన్ పై కూడా ఆ మచ్చ పడిపోయిందిగా

వైఎస్ కుటుంబానికి జనంలో ఓ పేరుంది. వారు మాట ఇస్తే తప్పరని, మడమ తిప్పరని అంతా అంటారు. వైఎస్సార్ తన పాలనలో చెప్పినవి, చెప్పనివీ కూడా చేసి [more]

Update: 2019-07-12 02:00 GMT

వైఎస్ కుటుంబానికి జనంలో ఓ పేరుంది. వారు మాట ఇస్తే తప్పరని, మడమ తిప్పరని అంతా అంటారు. వైఎస్సార్ తన పాలనలో చెప్పినవి, చెప్పనివీ కూడా చేసి మరీ జనానికి దేవుడైపోయారు. ఆయన పాలన దేవుడి రాజ్యంగా కొనియాడారంతా. ఇక జగన్ సైతం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ప్రమాణం చేస్తూనే ఆయన తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరసగా నెరవేరుస్తున్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ అయిదేళ్ళ పాలనలో వరుణుడు ఎంతగానే కరుణించాడు. అంతకు ముందు అయిదేళ్ళ పాటు బాబు ఏలుబడిలో కరవు కాటకాలతో ఆంధ్ర రాష్ట్రం అలమటించింది. వైఎస్ రాగానే సకాలంలో వానలు కురియడంతో రాజు మంచిగా ఉంటే ప్రకృతి కూడా దీవిస్తుందని నాటి కాంగ్రెస్ నాయకులు టీడీపీని వెటకారమాడేవారు.

తనయుడికి శత్రువా….

ఇక జగన్ విషయంలోనూ అదే విధంగా వరుణుడు కరుణిస్తాడని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు రాత్రి విజయవాడలో భారీ వర్షం కురిసింది. దాంతో అప్పటి వేసవి ఎండల నుంచి జనం ఉపశమనం పొందారు. జగన్ వస్తూనే వానలు తెప్పించారని కూడా వైఎస్సార్ పాలనను తలచుకున్నారు. అయితే ఆ ముచ్చట అక్కడికే పరిమితమైంది జగన్ సీఎం గా పాలన చేపట్టాక వాన దేవుడు ఎందుకో అలిగాడు. తుపాన్లు వచ్చినా కూడా అవి ఏపీని దాటిపోతున్నాయంటే ఎంతలా వరుణుడు పగపట్టాడోనని అంతా ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ఖరీఫ్ సీజన్ మొదలైంది, సాగు నీటికి కొరత ఉంది. మరో వైపు తాగు నీటికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీన్ని చూసిన టీడీపీ వారు జగన్ కి ప్రకృతి కరుణించడం లేదా అని సెటైర్లు వేస్తున్నారు.

బాబూ… కరవు అంటూ….

ఇక అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో కరవు రాజ్యమేలిన సంగతి విదితమే. దాంతో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లాంటి వారు బాబు కరవు కవల పిల్లలను ఘాటుగా విమర్శలు చేసేవారు. బాబు వస్తే వానలు పడవని కూడా ఎద్దేవా చేసేవారు. బాబు దిగిపోతేనే వానలు కురిసి ఏపీ చల్లగా ఉంటుందని కూడా చెప్పేవారు. ఇపుడు జగన్ పాలన మొదలైనా కూడా చుక్క నీరు లేక ఆకాశం వైపు జనాలు చూసే పరిస్థితి ఉంది. దీనికి ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలను రివర్స్ లో టీడీపీ ఆటాడుకుంటోంది. జగన్ కి వరుణుడు ఫ్రెండ్ కాడని, ఆయన వక్ర పాలన చూడలేకే వానలు కూడా పడడంలేదని విమర్సలు చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంతే బాబుపై పడిన కరవు మచ్చ ఇపుడు జగన్ మీద పడిందని అంటున్నారు. ఇకపై బాబును వాన, కరవు విషయంలో విమర్శించే అవకాశం ఎక్కడా వైసీపీ నేతలకు లేనే లేదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News