ఇక అమరావతి అందమైన నినాదమేనా?

కొన్ని నినాదాలు ఉంటాయి. అవి టైమ్ లీ గానే పాపులర్ అవుతూంటాయి. అలాంటి ఒక అందమైన నినాదమే మూడు రాజధానులు. 2019 డిసెంబర్ లో శీతాకాల సమావేశాల [more]

Update: 2021-02-05 14:30 GMT

కొన్ని నినాదాలు ఉంటాయి. అవి టైమ్ లీ గానే పాపులర్ అవుతూంటాయి. అలాంటి ఒక అందమైన నినాదమే మూడు రాజధానులు. 2019 డిసెంబర్ లో శీతాకాల సమావేశాల వేళ నిండు సభలో జగన్ మూడు రాజధానుల గురించి చెప్పినపుడు దేశం మొత్తం ఆసక్తిగా చూసింది, చెవులారా విన్నది. ఆ తరువాత 2020లో సగభాగం దాని మీదనే ఒక్క లెక్కన రచ్చ సాగింది. ఇక రెండవ అర్ధ భాగంలో చట్టం అయింది. ఆ మీదట కోర్టులో విచారణ దశలో ఉంది. నాటి నుంచి మూడు రాజధానుల మీద ఆసక్తి మెల్లగా తగ్గిపోతూ వస్తోంది.

నాడూ.. నేడూ….

ఇక జగన్ సర్కార్ చాలా విషయాలని మరచిపోదు, వాటిని తాను మననం చేసుకుంటూ టైమ్ లీగా జనాల ముందు కూడా పెడుతుంది. ప్రత్యేక హోదా అన్నది ఢిల్లీ వెళ్ళినపుడు జగన్ వినతిపత్రాల ద్వారా కేంద్ర పెద్దలకు అందచేస్తారు. హోదా గుర్తుంది ఈ సర్కార్ కి అని జనం అనుకుంటారు. ఆ తరువాత ఆ ఊసు ఉండదు, ఇక ఆ జాబితాలో మూడు రాజధానులు కూడా వచ్చి చేరాయి. జగన్ ఇప్పటికి రెండు స్వాతంత్ర వేడుకలు, రెండు రిపబ్లిక్ వేడుకలను ముఖ్యమంత్రిగా చూశారు. ఇందులో మొదటిది తప్ప మిగిలిన అన్ని జాతీయ పర్వదినాల్లో జగన్ మూడు రాజధానుల ముచ్చట గురించే గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఊదరగొడుతున్నారు. కానీ అదెప్పుడు అన్నదే ఇపుడు జనాల నుంచి వస్తున్న ప్రశ్న.

న్యాయ సమీక్షలతోనే …..

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గోస్వామి అస్సాం నుంచి వచ్చారు. ఇప్పటిదాకా పనిచేసిన జీకే మహేశ్వరి బదిలీ మీద వెళ్ళిపోయారు. ఇపుడు గోస్వామి ఈ విచారణను తిరిగి చేపట్టాలి. హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఒకవేళ సర్కార్ కి అనుకూలం అయినా కూడా సుప్రీం కోర్టుకు అమరావతి రైతులు కచ్చితంగా వెళ్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తో రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఎన్నెన్ని దశలుగా సాగిందో అంతా కళ్ళారా చూశాక అమరావతి రాజధాని విషయంలో అవతల పార్టీ వారు వెనక్కి తగ్గుతారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది మరి.

నమ్మేలా ఉందా..?

సరే జగన్ కమిట్మెంట్ ని బలంగా చెప్పుకోవడానికి ఆగస్ట్ 15, రిపబ్లిక్ డే ప్రసంగాలలో పదే పదే గట్టిగా మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తున్నారు అన్న మాట ఉంది. అయితే జనంలో దీన్ని ఎంత వరకూ నమ్ముతున్నారు అంటే పేలవమైన జవాబే వస్తోంది. జనమే ఒకవేళ నమ్మితే వారి స్పందనను చూసిన విపక్షం టీడీపీ అసలు ఊరుకోదు కదా. ఇపుడు ఎన్నిసార్లు రాజధానుల ప్రస్థావన వస్తున్నా ఆ వేడి వాడీ కనిపించడంలేదు. ఎందుకంటే అదొక నిర్లిప్తతగా మారిపోయింది. అదొక అందమైన నినాదంగానూ మారిపోయింది. అందుకే రేపటి బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధానుల ప్రస్థావన తప్పకుండా ఉంటుందని అపుడే సెటైర్లు పడుతున్నాయి. మరి ఇంతకీ మూడు రాజధానులు కూడా ప్రత్యేక‌ హోదాలా ముగిసిన అధ్యాయమా. లేక దేవతా వస్త్రాల టైప్ కధలాగ కొందరికే కనిపిస్తుందా. ఏమో తలపండిన రాజకీయ విశ్లేషకులకే అర్ధం కావడంలేదు మరి.

Tags:    

Similar News