యాంటీ సెంటిమెంట్ భయమా ?

జగన్ కూడా మనిషే. ఆయనకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఆ మాటకు వస్తే రాజకీయాలంటేనే అతి పెద్ద సెంటిమెంట్. పాదయాత్ర వైఎస్సార్ కుటుంబానికి అచ్చి వచ్చిన సెంటిమెంట్. [more]

Update: 2020-07-16 15:30 GMT

జగన్ కూడా మనిషే. ఆయనకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఆ మాటకు వస్తే రాజకీయాలంటేనే అతి పెద్ద సెంటిమెంట్. పాదయాత్ర వైఎస్సార్ కుటుంబానికి అచ్చి వచ్చిన సెంటిమెంట్. ఇక వైఎస్సార్ పధకాలు జగన్ కి బాగా కలసివస్తున్నాయి. కానీ వైఎస్సార్ దుర్మరణం పాలు అయిన సెప్టెంబర్ 2 అంటే ఆ కుటుంబానికే కాదు, రాష్ట్రానికే ఒక దుర్దినంగా మిగిలిపోయింది. అదే విధంగా వైఎస్సార్ రచ్చ బండ పేరు మీద హెలికాప్టర్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు దుర్మరణం పాలు అయ్యారు. దాంతో జగన్ రచ్చబండ అంటూంటే అటు కుటుంబ సభ్యులు, ఇటు పార్టీ నేతలు కూడా వద్దు బాబోయ్ అనే అంటున్నారుట. నిజానికి జగన్ కి కూడా తండ్రి మాదిరిగా ప్రజలలోకి వెళ్ళి తన ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు ఏంటో స్వయంగా తెలుగుకోవాలని ఉందిట.

జనంతో కనెక్షన్…..

వైఎస్ కుటుంబానికి జనంతోనే కనెక్షన్. అది ఎపుడూ రుజువు అవుతూనే ఉంది. ఎందరు సలహాదారులు ఉన్నా, మరెన్ని సర్వేలు చేసినా కూడా ప్రజల నోటి నుంచి పాలన బాగుంది అని వస్తే ఆ అనుభూతే వేరు. అందుకే వైఎస్సార్ కూడా జనాన్ని కలవడం కోసం రచ్చ బండ అని పేరు పెట్టి హెలికాప్టర్ లో బయల్దేరివెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడకు వెళ్ళకనే అలా మబ్బులోనే కలసిపోయారు. పదేళ్ళ తరువాత ఇపుడు తనయుడు జగన్ కూడా రచ్చబండ అంటున్నారు. దానికి ఆగస్ట్ మొదట అనుకున్నా కరోనా వల్ల అది సెప్టెంబర్ కి మార్చుకున్నారుట. అయితే సెప్టెంబర్ రచ్చబండ ఈ రెండూ ఇపుడు వైఎస్ ఫ్యామిలీనే కాదు, పార్టీని కూడా ఆందోళనలో పెడుతున్నాయట.

ఒప్పుకోరా..?

జగన్ జనం వద్దకు వెళ్ళడానికి ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు కానీ రచ్చ బండ వద్దు అని అటు తల్లి వైఎస్ విజయమ్మతో పాటు, ఇటు పార్టీ సీనియర్ నాయకులు కూడా గట్టిగా సూచిస్తున్నారుట. ఆశయం మంచిదే అయినా పెద్దాయన అకారణంగా పోవడంతో దాన్ని అంతా యాంటీ సెంటిమెంట్ గా భావిస్తున్నారుట. అలాగే వీలుంటే అక్టోబర్ లో పర్యటనలు పెట్టుకోవాలని నెల కూడా మార్చాలని కోరుతున్నారుట. ఇక పార్టీలో రచ్చ బండకు బదులుగా గ్రామ సభ అన్న పేరు కూడా సూచిస్తున్నారుట. మరో కండిషన్ కూడా పార్టీ నుంచి వస్తోందిట. జగన్ ఈ పర్యటనలకు అసలు హెలికాప్టర్ ఉపయోగించవద్దు అంటున్నారు. అది కూడా యాంటీ సెంటిమెంట్ గానే చూస్తున్నారుట‌.

మరి తప్పదా….?

సరే ఎవరెన్ని చెప్పినా ముఖ్యమంత్రిగా పార్టీ నాయకునిగా జగన్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఆయన‌ జనాలను కలిసేందుకే నిర్ణయించుకున్నారని అంటున్నారు. అది కూడా సెప్టెంబర్ నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయిందని చెబుతున్నారు. అయితే తల్లి మాటను, పార్టీ నేతల అభిప్రాయాలను జగన్ మన్నిస్తూ ఈ పర్యటనలకు గ్రామసభ గానే పేరు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక హెలికాప్టర్ ని కూడా వాడకూడదని కూడా భావిస్తున్నారుట. దానికి బదులుగా ప్రత్యేకంగా చేయించిన వాహనం ద్వారా జనాలను కలవాలని జగన్ ఆలోచిస్తున్నారుట. మొత్తానికి జగన్ ఈ విషయంలో కూడా తండ్రి బాటలో నడవాలనుకున్నా కార్యక్రమానికి ఆయన పెట్టిన పేరుని, ఎక్కిన హెలికాప్టర్ ని మాత్రం జగన్ అసలు టచ్ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి పార్టీ దీన్ని ఎలా డిజైన్ చేస్తుందో.

Tags:    

Similar News