వైరస్ జాడ వెతుకుతున్న జగన్ సర్కార్

మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. దీన్ని అంతం చేసేందుకు ప్రపంచం అనుసరిస్తున్న ఉత్తమ పద్దత్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అమల్లోపెట్టేందుకు సిద్ధం అవుతుంది. అంతే కాదు సరికొత్త రీతిలో వైరస్ [more]

Update: 2020-07-04 09:30 GMT

మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. దీన్ని అంతం చేసేందుకు ప్రపంచం అనుసరిస్తున్న ఉత్తమ పద్దత్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అమల్లోపెట్టేందుకు సిద్ధం అవుతుంది. అంతే కాదు సరికొత్త రీతిలో వైరస్ పై పరిశోధనలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంది వైఎస్ జగన్ సర్కార్. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ అందరి దృష్టిని ఎపి వైపు తిప్పేలా చేశారు జగన్. అంతే కాదు వెయ్యి కి పైగా 108, 104 అంబులెన్స్ లు ఒకేసారి ప్రజలకు అంకితం చేసి రికార్డ్ సృష్ట్టించింది సర్కార్.

పరీక్షల్లో పరిశోధనలు …

ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి పై మరో కొత్త అడుగు వేసింది వైద్య శాఖ. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఎక్కడ నమోదు అవుతుంది. అక్కడ నుంచి ఎలా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి అంశాలను విశ్లేషిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. మార్కెట్లు, బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, ఎయిర్ పోర్ట్ లు, సరిహద్దులు ఇలా హాట్ స్పాట్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయో పరీక్షల ద్వారా విశ్లేషిస్తుంది సర్కార్. ఇప్పటికే ఎపి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిరంతరం వైరస్ కట్టడి అప్ డేట్స్ వెల్లడిస్తూ పలు కీలక అంశాలు వెల్లడించారు.

అక్కడ యమా డేంజర్ …

కూరగాయల మార్కెట్లు, మాల్స్, మాంసాహార దుకాణాలు ఇక్కడికి వెళ్లి వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు జవహర్ రెడ్డి. అదే విధంగా కేసుల పెరుగుదలకు విమానాలు, రైళ్ళు , బస్సులు రాకపోకలు సాగించడం గా ఆయన తేల్చారు. ఆయా ప్రాంతాలనుంచి అందుతున్న కేసుల నివేదిక ప్రకారం ఆయన ఈ వివరాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తత, వ్యక్తిగత స్వీయ రక్షణే శ్రీరామ రక్ష అని చెబుతున్న ప్రభుత్వాల మాట ప్రతి ఒక్కరు పాటించండి సురక్షితంగా ఉండండి

Tags:    

Similar News