జగన్ మాస్టర్ స్ట్రోక్ అందుకేనా?

వైఎస్ జగన్ రాజధాని అమరావతి విషయంలో పూర్తి అవగాహనతో ఉన్నారు. ఆయన అనుకున్నట్లుగానే వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మూడు ప్రాంతాలు [more]

Update: 2019-12-17 13:30 GMT

వైఎస్ జగన్ రాజధాని అమరావతి విషయంలో పూర్తి అవగాహనతో ఉన్నారు. ఆయన అనుకున్నట్లుగానే వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి జరిగితేనే ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యమని జగన్ భావిస్తున్నారు. రాజధాని అమరావతిలో ఇక అన్ని ఉండే అవకాశం లేవు. కేవలం శాసనసభ, శాసనమండలి, మాత్రమే ఉండే అవకాశముంది.

విశాఖ అభివృద్ధికి…..

రాజధానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను నిర్మించాలన్న యోచనలో జగన్ ఉన్నారని స్పష్టమవుతోంది. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నంలో పెట్టనున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రకు న్యాయం చేసినట్లవుతుంది. విశాఖలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అక్కడ కార్యాలయాలు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉండదు. విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు చేయనున్నారు.

సీమ డిమాండ్ మేరకే….

ఇక కర్నూలులో గత కొంతకాలంగా హైకోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. రాయలసీమకు ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రాయలసీమకు కూడా న్యాయం చేసినట్లవుతుంది. అందువల్ల హైకోర్టు కర్నూలులో పెట్టే అవకాశమే ఉంది. అమరావతిలో మాత్రం కేవలం అసెంబ్లీ, శాసనమమండలి మాత్రమే ఉండనున్నాయి.

నిర్ణయం వారంరోజుల్లో…..

ఇందుకోసం జగన్ ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. ఇప్పటికే ఈ కమిటీలు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. సమగ్ర అధ్యయనం తర్వాత వారం రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సౌతాఫ్రికాలోనూ మూడు రాజధానులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ వ్యాఖ్యలను బట్టి రాజధాని అమరావతిని ఇక్కడే ఉంచి కొంతమేరకే అభివృద్ధి చేయనున్నట్లు కన్పిస్తుంది. మొత్తం మీద జగన్ రాజధాని అమరావతిపై స్పష్టతతో ఉన్నారు. ఎన్నికల్లో మూడు ప్రాంతాల ప్రజలు తనను ఆదరించినందున అందరికీ న్యాయం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ సులువుగా గట్టెక్కే అవకాశముందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అమరావతిపై ఉన్న చంద్రబాబు ముద్ర కూడా ఈ సందర్భంగా తొలగిపోనుంది.

Tags:    

Similar News