జ‌గ‌న్‌పై సైలెంట్ టాక్‌.. ఇంటిలిజెన్స్ రిపోర్టు ఇదేనా…?

రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర‌ పూర్తయింది. ఏ ప్రభుత్వానికైనా.. ఈ ఏడాదిన్నర కాలంలో తాము చేసిన ప‌నుల‌పై ప్రజ‌లు ఏమ‌నుకుంటున్నారు ? ప్రజ‌ల్లో స్పంద‌న ఎలా [more]

Update: 2020-12-05 14:30 GMT

రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర‌ పూర్తయింది. ఏ ప్రభుత్వానికైనా.. ఈ ఏడాదిన్నర కాలంలో తాము చేసిన ప‌నుల‌పై ప్రజ‌లు ఏమ‌నుకుంటున్నారు ? ప్రజ‌ల్లో స్పంద‌న ఎలా ఉంది ? ఇంకా మెరుగైన పాల‌న ఎలా అందించాల‌నే ఆతృత ఉంటుంది. గ‌తంలో చంద్రబాబు అయితే.. ప్రతి ఆరు మాసాల‌కు ఒక‌సారి ప్రజ‌ల సంతృప్తి అనే పేరుతో నివేదిక‌లు విడుద‌ల చేసేవారు. ప్రజ‌ల సంతృప్త స్థాయిని ఆయ‌న ఎప్పటిక‌ప్పుడు కొలుచుకునేవారు. చివ‌రికి ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న ప్రజ‌ల సంతృప్తి త‌మ ప్రభుత్వంపై 85 శాతం ఉంద‌ని చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రజా సంతృప్త స్థాయి కోసం చేయించుకున్న స‌ర్వేల్లో నాటి ఇంటిలిజెన్స్ వ‌ర్గాల వైఫ‌ల్యం ఎక్కువుగా ఉంది. అందుకే చంద్రబాబు ఓట‌మిలో నాటి ఇంటిలిజెన్స్ బాస్‌ది కూడా కీల‌క పాత్ర అని టీడీపీ వాళ్లే చెప్పుకుంటూ ఉంటుంటారు.

మహిళలు ఎక్కువగా…

అయితే.. ఆ రేంజ్‌లో కాక‌పోయినా.. జ‌గ‌న్ కూడా ప్రజానాడిని తెలుసుకుంటున్నారు. త‌న‌కున్న మీడియా, త‌న ప్రభుత్వంలో ఉన్న ఇంటిలిజెన్స్ వ‌ర్గాల నుంచి రిపోర్టులు తెప్పించు కుంటున్నారు. వీటిని ఆయ‌న విశ్లేషించుకుంటున్నారు. తాజాగా ఏడాదిన్నర పూర్తయిన సంద‌ర్భంగా ఇంటిలిజెన్స్ ఓ నివేదిక అందించిన‌ట్టు తెలిసింది. దీనిని విశ్లేషించిన జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి చూచాయ‌గా మీడియాకు కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి.. మ‌హిళ‌ల్లో జ‌గ‌న్‌పై అబిమానం పెరిగింద‌ట‌. జ‌గ‌న్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ ప‌థ‌కాల‌పై మ‌హిళ‌ల్లో సానుభూతి పెరిగింద‌ని.. మ‌హిళా ఓటు బ్యాంకు త‌మ‌కేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో….

ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల విష‌యంలో నిమ్మగ‌డ్డ ‌ర‌మేష్‌కుమార్ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే.. క‌రోనా ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఎలా నిర్వహిస్తారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చిన స‌జ్జల నిమ్మగ‌డ్డపై విమ‌ర్శలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఒక‌టి అరా.. బ‌య‌ట పెట్టారు. సార్‌.. ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్నారా ? అన్న మీడియా మిత్రుల‌తో ఆయ‌న అదేం లేదు.. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు నిర్వహించినా మాకు భ‌యంలేదు. మ‌హిళా ఓటు బ్యాంకు మావైపే ఉంది.. మాకున్న మార్గాల్లో మేం స‌మాచారం తెప్పించుకున్నాం. దానిని బ‌ట్టి చెబుతున్నాను అన్నారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా…?

అప్పట్లో ఇది బ‌య‌ట‌కు రాక‌పోయినా.. కొంద‌రు మంత్రులు కూడా తాజాగా మీడియా ముందు ఇదే వ్యాఖ్యలు చేశారు. తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో సీఎం జ‌గ‌న్‌.. స్థానిక ఎన్నిక‌ల‌పై చ‌ర్చించిన‌ప్పుడు.. ఆయ‌న కూడా ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చార‌ట‌. మ‌నం నిర్వహించిన స‌ర్వేల్లో మ‌హిళ‌లు మ‌న‌ప‌క్షంగానే ఉన్నార‌ని తెలిసింది. అంతా సైలెంట్‌గా జ‌రిగిపోతుంది. మీరేమీ కంగారు ప‌డొద్దు ఆయ‌న భ‌రోసా ఇచ్చార‌ట‌. ఇదీ సంగ‌తి. అయితే జ‌గ‌న్ సంతృప్త స్థాయి నాటి చంద్రబాబు మాదిరిగా నీటి బుడ‌గ‌లా ఉంటుందా ? లేదా ? అన్నది స్థానిక ఎన్నిక‌లు, తిరుప‌తి ఎన్నిక‌లే తేల్చేస్తాయి. ఈ మాట టీడీపీ నేతలే అంటుండటం విశేషం.

Tags:    

Similar News