స్థానికంపై జ‌గ‌న్ ప‌ట్టు.. క్లీన్ స్వీప్‌కు వ్యూహం ఇదే

స్థానిక ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి ? ఎలా జ‌రుగుతాయి ? రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఇదే ప్రశ్న తెరమీదికి వ‌స్తోంది. దీనికి కార‌ణం ఈ ఏడాది ప్రారంభంలోనే జ‌ర‌గాల్సిన [more]

Update: 2020-11-30 03:30 GMT

స్థానిక ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి ? ఎలా జ‌రుగుతాయి ? రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఇదే ప్రశ్న తెరమీదికి వ‌స్తోంది. దీనికి కార‌ణం ఈ ఏడాది ప్రారంభంలోనే జ‌ర‌గాల్సిన ఎన్నికలు వాయిదా ప‌డ్డాయి. స్థానికం కోసం ప్రతిప‌క్షాలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేసిన ఎన్నిక‌ల‌ను క‌రోనా వెళ్లిపోయే వ‌ర‌కు నిర్వహించ‌వ‌ద్దని.. ప్రభుత్వం కోరుతోంది. అయితే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కే మొగ్గు చూపుతోంది. దీనికి సంబంధించి అవ‌స‌ర‌మైతే.. కోర్టుకు సైతం వెళ్లాల‌ని నిర్ణయించుకుంది. స‌రే… రేపు ఎటు పోయి ఎటొచ్చినా.. త‌మ పంతం వీగిపోయి.. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చినా.. త‌మ‌దే పైచేయి కావాల‌నే వ్యూహంతో జ‌గ‌న్ ముందుకు వెళ్లేలా గ్రౌండ్ వ‌ర్క్ చేసేస్తున్నారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా…

ఒక‌వేళ .. నోటిఫికేష‌న్‌ను ఆది నుంచి మొద‌లు పెట్టినా.. ఇబ్బంది లేకుండా వైసీపీ గెలుపున‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వ‌ర‌కు తాత్సారం చేస్తూ. వ‌చ్చిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల ప‌థ‌కాన్ని వ‌డివ‌డిగా ప‌ట్టాలెక్కించాల‌ని నిర్ణయించారు. డిసెంబర్‌ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వ పెద్దలను ఆదేశించారు.

నాలుగు సార్లు వాయిదా పడి….

అదేవిధంగా వివాదాలు ఉన్న భూముల విష‌యంలోనూ అధికారులు వెంట‌నే స్పందించి కోర్టుల్లో కేసులు ఎత్తివేయించేలా చేయాల‌ని కూడా జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. డిసెంబ‌రు చివ‌రి వారం నుంచి జ‌న‌వ‌రి తొలి వారం మ‌ధ్య వ‌ర‌కు ఈ పంపిణీ పూర్తి చేయాల‌ని నిర్ణయించుకున్నారట జ‌గ‌న్‌. అయితే.. ఇప్పటి వ‌ర‌కు దాదాపు నాలుగు సార్లు ఈ కార్యక్రమం వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పడు అనూహ్యంగా తెర‌మీదికి తేవ‌డం వెనుక స్థానిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నార‌నే టాక్ వైసీపీలో వినిపిస్తోంది.

విపక్షాలకు కౌంటర్ గా…..

అయితే.. దీనిపై ప్రతిప‌క్షాలు ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ ఓట్ల కోస‌మే.. ఇప్పుడు ఇళ్లు పంచుతున్నారంటూ.. వారు కామెంట్లు చేస్తే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏం జ‌రిగిందో.. వైసీపీ నేత‌లు విమ‌ర్శించే అవ‌కాశం ఉంటుంది. ఇక, ఇదిలావుంటే.. చంద్రబాబు మాత్రం తాను గ‌తంలో అధికారంలో ఉన్నప్పుడు క‌ట్టించిన టిడ్కో ఇళ్లను ఇవ్వాల‌ని అంటున్నారు. కానీ… జ‌గ‌న్ మాత్రం.. తాను నిర్ణయించిన ఇళ్ల స్థలాల‌ను మాత్రమే ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు కంక్లూజ‌న్ స్థానిక‌మే..! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News