ఆ లేఖ విషయం ఏమైంది?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి నెలలు గడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ చీఫ్ జస్టిస్ దీనిపై ఎలాంటి [more]

Update: 2020-11-29 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి నెలలు గడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ చీఫ్ జస్టిస్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ లేఖ రాయడం తప్పు అని కొందరు అంటుంటే, మరికొందరు దానిని సమర్థిస్తున్నారు. ఆ లేఖ పై జగన్ కు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, అది తమకు అవకాశమని టీడీపీ గట్టిగా భావిస్తుంది. అందుకే జగన్ లేఖ పై చర్యలు తీసుకోవాలని నిత్యం కోరుతూనే ఉంది.

కొందరు సమర్థిస్తుండగా…..

ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై లేఖ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ న్యాయవ్యవస్థతో ఆటాడుకుంటున్నారన్న వారు లేకపోలేదు. పలు న్యాయవాద సంఘలు, అడ్వకేట్ జనరల్ వంటి వారు సయితం జగన్ లేఖపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి జగన్ చర్యను సమర్థిస్తున్నారు.

కాచుకుని ఉన్న టీడీపీ……

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగన్ రాసిని లేఖను తప్పు పట్టి తీవ్రమైన అంశంగా పరిగణిస్తే చిక్కులు తప్పవని టీడీపీ అంచనా వేస్తుంది. అప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన స్థానంలో వేరెవరు వచ్చినా తాము పార్టీని బలోపేతం చేసుకోవడానికి సులువవుతుందని టీడీపీ విశ్వసిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో దీనిపై ఎప్పటికప్పడు టీడీపీ నేతలు దీని అప్ డేట్ తెలుసుకుంటూనే ఉన్నారు.

న్యాయనిపుణుల సలహా మేరకే……

కానీ జగన్ మాత్రం బిందాస్ గా ఉన్నారు. తనకు ఏపీ హైకోర్టులో ఎదురవుతున్న చిక్కులతో పాటు, ఆ న్యాయమూర్తి కుటుంబం చేసిన అక్రమాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. అంతేకాదు తాము న్యాయనిపుణుల సలహా మేరకే చీఫ్ జస్టిస్ కు లేఖ రాశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే నెలలు గడుస్తున్నా జగన్ లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News