జగన్ కు డేంజర్ బెల్స్… సర్వే రిపోర్ట్ ఇదే..?

ఏపీ జనంలో ఇప్పటికిపుడు ఉన్న అభిప్రాయం ఇదేనా. అంటే చెన్నైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో అదే నిజం అని చెబుతోందిట. జగన్ సంక్షేమ [more]

Update: 2020-11-28 05:00 GMT

ఏపీ జనంలో ఇప్పటికిపుడు ఉన్న అభిప్రాయం ఇదేనా. అంటే చెన్నైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో అదే నిజం అని చెబుతోందిట. జగన్ సంక్షేమ పధకాలు భేష్, ఆయన పాలన కూడా భేష్. కానీ ట్విస్ట్ ఏంటి అంటే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యెలలో సగానికి పైగా వేస్ట్ అంటున్నారుట ఏపీ జనం. ఇలా జనం నాడిని పసిగట్టి ఆ చెన్నైకి చెందిన సంస్థ సర్వే నివేదికను తయారు చేసిందట. అదే నిజం అయితే చంద్రబాబు ఏలుబడిలో వచ్చిన ఒక నివేదిక మాదిరిగానే ఇది కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

నాడు బాబూ అలా….

అంతా అధికారుల మయం చేసి తానే సర్వం అనుకుని అయిదేళ్ళ పాటు ఏపీ సీఎం గా చంద్రబాబు పాలన సాగించారు. ఆయన హయాంలో కూడా ఎమ్మెల్యేలకు అసలు విలువ లేదు, అధికారులదే హవా. బాబు కూడా ఎమ్మెల్యేలకు అసలు టైం ఇవ్వలేదు, పైగా అధికారులు ఉంటే చాలు అనుకున్నారు, చివరికి 2019 ఎన్నికల్లో దాని ప్రభావం గట్టిగానే పనిచేసింది. మరి దాన్ని చూసి జగన్ నేర్చుకున్న పాఠం ఏమీ లేదని తాజా సర్వే చెబుతోంది. జగన్ కూడా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను గట్టిగా నమ్ముకున్నారు. ఇక జిల్లా కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మరి ఎమ్మెల్యేలు చేసేది ఏముంటుంది అన్నదే ప్రశ్న.

వారి మీద అసమ్మతి….

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల మీద అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉందట. ఏకంగా 87 మంది ఎమ్మెల్యేల మీద జనం నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. వారంతా తమకు తెలియదు, కనబడడంలేదు అని జనం నుంచి సమాధానంగా వచ్చిందంట. జగన్ వరకూ బాగానే చేస్తున్నారు కానీ మేము ఓటేసిన ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో తెలియదు అని జనం చెబుతున్నారంటే డేంజర్ బెల్స్ మోగినట్లే. జగన్ కూడా ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోవడంలేదన్నది వాస్తవం. వారికి చేతులు కట్టేసినట్లుగా ఉంది. దాంతోనే జనంలోకి వెళ్ళలేకపోతున్నారుట. ఇక మంత్రుల విషయంలోనూ కొందరి మీద జనం గుస్సాగా ఉన్నారుట.

రిపేర్లు చేయాల్సిందే…..

ఇక జగన్ పార్టీ మీద శ్రద్ధ పెట్టి గేర్ మార్చాల్సిందేనని అంతా అంటున్నారు. జగన్ ఒక్కడే సూపర్ అంటే పులివెందులలో బంపర్ విక్టరీ కొడతారు. మరి ఇలా పెద్ద సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేల మీద జనం గుర్రుగా ఉంటే జగన్ వచ్చి వారి సీట్లో పోటీ చేయరు కదా అని అంటున్నారు. చివరి నిమిషంలో వారిని మార్చి కొత్తవారికి టికెట్లు ఇద్దామనుకున్నా రాజకీయంగా బెడిసి కొడుతుంది తప్ప పార్టీకి మేలు చేయదని కూడా అంటున్నారు. అందువల్ల ఇప్పటి నుంచే సర్దుకోవాలని, ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేయకుండా వారితోనే జాగ్రత్తగా కధ నడిపించాలని పార్టీలో సూచనలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే రిపేర్లు మొదలెడితే పార్టీ మళ్లీ గట్టెక్కుతుంది అంటున్నారు. మొత్తానికి చెన్నై సంస్థ అంటూ వచ్చిన నివేదికలో నిజాలు మాట పక్కన పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ దయకు నోచుకోకుండా అలాగే ఉన్నారు. ఇక జనాల్లో కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందని అంటున్నారు.

Tags:    

Similar News