ఈ మార్పు ఎందుకో? ఒకసారి సర్వే చేయించి చూడు

అది అహంకారమనుకోవాలా? విజయం తెచ్చిపెట్టిన ఉత్సాహం అనుకోవాలా? లేక తనకు ఎదురేలేదన్న మనస్తత్వం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇన్ని సందేహాలు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వస్తున్నాయి. [more]

Update: 2020-11-25 14:30 GMT

అది అహంకారమనుకోవాలా? విజయం తెచ్చిపెట్టిన ఉత్సాహం అనుకోవాలా? లేక తనకు ఎదురేలేదన్న మనస్తత్వం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇన్ని సందేహాలు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వస్తున్నాయి. జగన్ అధికారంలోకి రాకముందు అందరికీ అందుబాటులో ఉండేవారు. మీడియా సమావేశాలు పెట్టి అప్పటి ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేవారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకే జగన్ ప్రయత్నించేవారు.

క్షేత్రస్థాయిలో …..

కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వ్యవహారశైలి పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్లేనన్న ధోరణితో ఉన్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా మందగించిందన్న విపక్ష నేతలకు కూడా సమాధానం చెప్పే తీరిక జగన్ కు లేదనుకోవాలి.

పదహారు నెలల్లో….

జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు గడుస్తుంది. ఈ పదహారు నెలల్లో జగన్ ప్రజల్లోకి వచ్చింది పెద్దగా లేదు. కరోనా కారణంగా బయటకు రాలేదనుకున్నా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు జగన్ హాజరవుతున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. జల్లాల పర్యటనలను కూడా పూర్తిగా మానుకున్నట్లే కన్పిస్తుంది. తాడేపల్లి రాజప్రసాదానికే జగన్ పరిమితమయ్యారు.

ఒకసారి సర్వే చేయిస్తే….

ఇక జగన్ మంత్రి వర్గ సమావేశాల సమయంలో తప్పించి సచివాలయానికి కూడా రావడం మానుకున్నారు. జగన్ సెక్రటేరియట్ కు రాకపోవడంతో మంత్రులు కూడా కన్పించడం లేదు. ఇక అధికారుల సంగతి సరేసరి. వారిదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. అందుకే వైసీపీ నేతలే జగన్ ఒకసారి ప్రశాంత్ కిషోర్ టీం చేత సర్వే చేయించుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఇప్పుడిప్పుడే వస్తుండటాన్ని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద జగన్ వ్యవహారశైలి పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News