జగన్ క్విక్ రియాక్షన్ ఎందుకో? అన్నింటిలో కాకుండా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాంతాలపై పెట్టడం లేదు. ఈ విషయం ప్రభుత్వ నిర్ణయాల పరంగానూ, పార్టీ విషయంలోనూ స్పష్టమవుతుంది. విశాఖపట్నానికి జగన్ [more]

Update: 2020-11-20 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాంతాలపై పెట్టడం లేదు. ఈ విషయం ప్రభుత్వ నిర్ణయాల పరంగానూ, పార్టీ విషయంలోనూ స్పష్టమవుతుంది. విశాఖపట్నానికి జగన్ అంతటి ప్రాధాన్యత జగన్ ఇస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తోంది. ఈ పదహారు నెలల్లో అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు పడటం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పొసగడం లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

సీరియస్ అయి….

అయితే విశాఖపట్నంలో జరిగిన సంఘటనపైనే జగన్ సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో జగన్ నేరుగా వారిని తాడేపల్లికి పిలిపించుకుని క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. విశాఖలో భూదందాలు విషయంలో వైసీపీ నేతలే బాహాటంగా చర్చకు పెట్టడంతో జగన్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని నిర్ణయించడంతో విశాఖ వైసీపీ నేతల మధ్య విభేదాలు జగన్ కు చికాకు తెప్పించాయంటున్నారు.

విశాఖ పంచాయతీని…..

అలాగే విశాఖలో త్వరలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది జగన్ పట్టుదలగా ఉంది. ఎన్నికలకు ముందు పెట్టుకుని ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడంపై జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇది విశాఖ ప్రాంతానికే పరిమితం కాలేదు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.

మిగిలిన నియోజకవర్గాల్లో…..

తాడేపల్లికి సమీపంలోనే ఉన్న నరసరావుపేట ఎంపీ ని వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడి పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అనంతపురంలో శంకరనారాయణను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అంబటి రాంబాబుపై సొంత పార్టీ నేతలే మైనింగ్ విషయంలో కోర్టుకెళ్లారు. అయినా జగన్ పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోని జగన్ విశాఖ విషయంలో వెంటనే రియాక్ట్ కావడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలపై జగన్ ఇలానే దృష్టి పెట్టాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News