టీడీపీ వీకయితే జగన్ కే నష్టమా?

ఎప్పుడైనా సమఉజ్జీ ఉండాలి. ఏపీలో ప్రస్తుతం జగన్ కు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మాత్రమే. అయితే తెలుగుదేశం పార్టీని జగన్ బలహీన పర్చే కొద్దీ ఆయనకు [more]

Update: 2020-11-19 02:00 GMT

ఎప్పుడైనా సమఉజ్జీ ఉండాలి. ఏపీలో ప్రస్తుతం జగన్ కు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మాత్రమే. అయితే తెలుగుదేశం పార్టీని జగన్ బలహీన పర్చే కొద్దీ ఆయనకు భవిష్యత్ లో ఇబ్బంది అవుతుందా? అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ పటిష్టమైన క్యాడర్, ఓటు బ్యాంకుతో ఉంది. గత ఎన్నికల్లోనూ 40 శాతానికి పైగానే ఓటింగ్ శాతాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీని బలహీన పర్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో……

మరోవైపు బీజేపీ, జనసేన బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, జనసేన బలోపేతమై తెలుగుదేశం పార్టీ బలహీన పడితే అది జగన్ కే మైనస్ అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికను తీసుకుంటే ఏపీలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ను వీక్ చేసేశారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. బీజేపీ పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరించారు. అదే దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీకి దెబ్బకొట్టింది.

కాంగ్రెస్ వీక్ కావడంతోనే….

కాంగ్రెస్ వీక్ కావడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు సయితం బీజేపీ వైపు మరలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పోయింది. ఫలితం కేసీఆర్ అనుభవించాల్సి వచ్చింది. అలాగే ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ బలహీనపడే కొద్దీ ఆ ఓటు బ్యాంకు బీజేపీ, జనసేన వైపు మొగ్గు చూపే అవకాశముంది. అది రానున్న ఎన్నికల్లో జగన్ కు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

ఆ ఓటు బ్యాంకు టర్న్ అయితే…?

టీడీపీకి ఏపీలో సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. బీసీలతో పాటు మేధావులు, తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారు. చంద్రబాబు నాయకత్వం పట్ల ఈ వర్గాలు సానుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు బలహీనపడ్డారో ఈ వర్గమంతా బీజేపీ వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే జగన్ తెలుగుదేశం పార్టీని బలహీన పర్చే ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మేలన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రెండు బలమైన పార్టీలు బరిలో ఉంటేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అధికార పార్టీకి లాభం చేకూరుతుందన్నది వాస్తవం. మరి జగన్ టీడీపీని బలహీనపర్చి తనకు తానే చేటును తెచ్చుకుంటారో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News