గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు గడుస్తుంది. ఈ పదహారు నెలల్లో జగన్ సాధించిందేమిటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది. విపక్షంపై కక్ష [more]

Update: 2020-11-14 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు గడుస్తుంది. ఈ పదహారు నెలల్లో జగన్ సాధించిందేమిటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది. విపక్షంపై కక్ష సాధింపు చర్యలకే జగన్ ఎక్కువ సమయాన్ని కేటాయించారన్నది మాత్రం వాస్తవం. సాఫీగా సాగిపోయే పాలనను తన నిర్ణయాలతో వివాదాలను జగన్ కొని తెచ్చుకున్నారన్న విమర్శలు అయితే సర్వత్రా విన్పిస్తున్నాయి.

కష్టపడి అధికారంలోకి వచ్చి….

జగన్ ఎనిమిదేళ్ల పాటు కష్టపడి అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించారు. మ్యానిఫేస్టోలో రూపొందించిన అంశాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతవరకూ ఓకే. జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలును చూసి విపక్షాలే నోళ్లు తెరుచుకునే పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి పనులు పెద్దగా లేకపోయినా ప్రజలు పట్టించుకోలేదు.

అన్నీ చికాకు అంశాలే….

కానీ జగన్ నిర్ణయాలు కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు పట్ల ఈ వర్గాల ప్రజలు మొగ్గు చూపకపోయినప్పటికీ మూడు రాజధానులు, న్యాయవ్యవస్థతో పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డతో విభేదాలు ఇవన్నీ జగన్ తనకు తానే తెచ్చుకున్నవేనన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. శాసనమండలి రద్దు విషయంలోనూ ఉద్యోగులు, విద్యావంతులు జగన్ నిర్ణయాన్ని సమర్థించడం లేదు.

రాష్ట్రాభివృద్ధి విషయంలో……

గోటితో పోయే దాన్ని జగన్ గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారన్న వ్యాఖ్యలయితే సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ జగన్ పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి, తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు తప్పించి, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా పయనింపచేయడంలో జగన్ విఫలమయ్యారన్న విమర్శలయితే సర్వత్రా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News