హనీమూన్ ముగిసినట్లేనా ?

జగన్, చంద్రబాబుల మధ్య స్పష్టమైన తేడా ఉందని జనం భావిస్తారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా అంత తొందరగా సాహసించరని కూడా అనుకుంటారు. అదే జగన్ అయితే [more]

Update: 2020-11-12 05:00 GMT

జగన్, చంద్రబాబుల మధ్య స్పష్టమైన తేడా ఉందని జనం భావిస్తారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా అంత తొందరగా సాహసించరని కూడా అనుకుంటారు. అదే జగన్ అయితే దూకుడుగా ఉంటారని, అమీ తుమీ తేల్చుకొస్తారని కూడా సాదర జనంలో ఒక కచ్చితమైన భావన ఉంది. కానీ ఏడాదిన్నర జగన్ పాలన మాత్రం కొన్ని విషయాల్లో అచ్చం బాబు బాటలోనే సాగుతోంది అన్న అసంతృప్తి ఐతే అందరిలో ఉంది. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని జగన్ తీసుకురాలేకపోతున్నాడు అన్నది అందరిలో ఉంది. రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో జగన్ కూడా తలొగ్గుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

సమయం వచ్చిందా …?

ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నా కూడా ఏ మాత్రం ఖాతరు లేకుండా కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్నారు అన్న ఆగ్రహం అయితే జగన్ లోనూ ఉంది అంటున్నారు. తాము కేంద్రంతో గొడవలు పెట్టుకోకుండా ఏపీ అభివృద్ధి కోసం పనిచేయాలని చూస్తూంటే ఢిల్లీ పాలకులు మాత్రం తెగే దాకా లాగుతున్నారన్న బాధ వైసీపీ నేతల్లో కూడా ఉంది. ప్రత్యేక హోదాను మడిచేసినా, విభజన హామీల విషయంలో వెనకంజ వేసినా వైసీపీ సహిస్తూనే ఉంది. అయితే ఇపుడు కేంద్ర పెద్దలు మాత్రం ఏకంగా పోలవరానికే టెండర్ పెట్టేస్తూంటే వైసీపీ పెద్దల్లో కోపం కట్టలు తెంచుకుంటోందిట.

పవర్ చూపిస్తారా…?

ఇక కేంద్రంతో హానీమూన్ ముగిసిందని కూడా జగన్ భావిస్తున్నట్లే కనిపిస్తోంది. పోలవరం వైఎస్సార్ కలల ప్రాజెక్ట్. జగన్ కి కూడా అది చాలా కావాల్సిన ప్రాజెక్ట్. మరి దాని జోలికొస్తే ఎంతకైనా తెగించాలన్నది వైసీపీలో ఇపుడు వినిపిస్తున్న తాజా మాట. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని కేంద్రమే పూర్తి చేయాలని కూడా జగన్ భావిస్తున్నారుట. అవసరం అయితే ఆ ప్రాజెక్ట్ ని కేంద్రానికే అప్పగించైనా పూర్తి చేసేలా చూడాలనుకుంటున్నారుట. దీనిమీదనే తాజాగా ఆయన మోడీకి లేఖ రాశారు. కానీ స్పందన ఇంకా తెలియలేదు ఒకవేళ ప్రతికూలంగా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం అతి పెద్ద పొలిటికల్ సినిమానే జగన్ చూపించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

రాజీనామాలేనా..?

పోలవరం విషయంలో ప్రజలు సైతం కేంద్రాన్ని తప్పు పడుతున్నారు. ఇక జగన్ కనుక కేంద్రాన్ని నిలదీస్తే కచ్చితంగా వారంతా జగన్ వెంట ఉంటారు. ఇపుడు అవే లెక్కలతో జగన్ తొలిసారిగా మోడీని ఎదిరించబోతున్నారు అంటున్నారు. మోడీ కనుక పోలవరానికి నిధులు ఇవ్వకపోతే వైసీపీకి చెందిన మొత్తం లోక్ సభ ఎంపీలు మూకుమ్మడి గా రాజీనామాలు చేసి జాతీయ స్థాయి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువస్తారని చెబుతున్నారు. అంతే కాదు, తెలుగు రాష్ట్రాలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఎక్కడా మంచినీళ్ళు పుట్టకుండా జగన్ తన సత్తా చూపిస్తారని అంటున్నారు. పోలవరం సమస్య మీద జగన్ ఎంపీలు రాజీనామాలు చేస్తే తిరిగి వారు గెలవడం ఖాయం. ఆ విధంగా ప్రజా బలం చూపించి అయినా మోడీని లొంగదీయాలని జగన్ భారీ పధకమే వేశారని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News