జగన్ కొంపను వాళ్లే ముంచుతున్నారా?

అధికారులే జగన్ కొంపముంచుతున్నారా? న్యాయస్థానాల్లో అనేక ప్రభుత్వ ఉత్తర్వులు నిలిచిపోవడానికి అధికారుల వైఖరే కారణమా? అధికారులు చెబుతున్నా జగన్ పట్టించుకోవడం లేదా? ఇదే ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న [more]

Update: 2020-11-17 08:00 GMT

అధికారులే జగన్ కొంపముంచుతున్నారా? న్యాయస్థానాల్లో అనేక ప్రభుత్వ ఉత్తర్వులు నిలిచిపోవడానికి అధికారుల వైఖరే కారణమా? అధికారులు చెబుతున్నా జగన్ పట్టించుకోవడం లేదా? ఇదే ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చ. దాదాపు 78 వరకూ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కొన్నింటిని నిలిపివేసింది. అయినా ప్రభుత్వం తీరు మార్చుకోలేదు. ఇప్పటికీ హైకోర్టు నుంచి ప్రభుత్వానికి చుక్కెదురవుతూనే ఉంది. ఈపరిస్థితికి కారణమెవ్వరన్న చర్చ జరుగుతుంది.

నిమ్మగడ్డ విషయంలోనూ…

తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. రాజ్యాంగ వ్యవస్థలకు ప్రభుత్వం సహకరించాలని పేర్కొంది. దీనికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న రాష్ఠ్ర ఎన్నికల కమిషన్ కు సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడం, ఆయనను పెద్దగా పట్టించుకోక పోవడం హైకోర్టు ఆగ్రహానికి కారణంగా చెప్పవచ్చు. అయితే దీనికి అధికారుల తీరే కారణమని పార్టీలో చర్చ జరుగుతుంది.

న్యాయవ్యవస్థపై….

అధికారులు తనకు సహకరించడం లేదని జగన్ కు అర్థమవుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. న్యాయవ్యవస్థపైనే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ తనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని జగన్ నమ్ముతున్నారు. అలా జగన్ ను అధికారులు నమ్మించగలిగారు. అందుకే జగన్ నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదనే చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారంటున్నారు. ఇలా అధికారులు తాము చేసిన తప్పులను కూడా తెలివిగా అధికారులు న్యాయవ్యవస్థపై నెడుతున్నారని పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

పార్టీలో హాట్ టాపిక్……

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించగానే కొందరు కీలక అధికారులను తప్పించారు. వారంతా చంద్రబాబు విధేయులని జగన్ వారిని పక్కన పెట్టారు. అయితే ఇప్పటికీ చంద్రబాబు హయాంలో కీలకంగా పనిచేసిన వారే జగన్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వంలో అధికారుల తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే జగన్ కు చెప్పే ధైర్యం నేతలు చేయలేకపోతున్నారంటున్నారు.

Tags:    

Similar News