వెళ్లాలంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా…?

వైసీపీలో కీల‌క విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం జ‌గ‌న్ .. జిల్లాల ప‌ర్యట‌నకు వెళ్లడం లేద‌ని, వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాలలో ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున [more]

Update: 2020-11-23 02:00 GMT

వైసీపీలో కీల‌క విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం జ‌గ‌న్ .. జిల్లాల ప‌ర్యట‌నకు వెళ్లడం లేద‌ని, వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాలలో ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్రతిప‌క్షాలు ఈ విష‌యాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దుమ్మెత్తి పోస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి.. నారా లోకేష్ ఈ విష‌యాన్ని మ‌రింత‌గా రాజ‌కీయం చేశారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని కూడా ఆయ‌న కామెంట్ చేశారు. మోకాల్లోతు నీటిలో దిగి.. బాధితుల‌ను లోకేష్ ప‌రామ‌ర్శించారు.

జిల్లాల పర్యటనను….

అయితే, అదే స‌మ‌యంలో సీఎం జిల్లాల్లో క‌నీసం ప‌ర్యటించ‌డం లేద‌ని. బాధితుల‌ను కూడా ప‌ట్టించుకోవడం లేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్యల‌పై వైసీపీ నుంచి కౌంట‌ర్లు వ‌చ్చినా.. మంత్రి కొడాలి నాని వంటివారు.. ఎదురు దాడి చేసినా.. వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ చోటు చేసుకుంది. జ‌గ‌న్ జిల్లా ప‌ర్యట‌న‌ల‌కు ఎక్కడో జంకుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ప్రజ‌ల నుంచి వ్యతిరేక‌త వ‌స్తుంద‌ని భ‌య‌మా.. ? లేక‌.. ప్రతిప‌క్ష నేత‌ల నుంచి వ్యతిరేకత వ‌స్తుంద‌ని భ‌య‌మా? అనేది అర్ధం కాక‌పోయినా.. గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. త‌ర‌చుగా ప్రజ‌ల్లోకి వెళ్లేవారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం వెళ్లడం లేదు.

పశ్చిమ గోదావరి జిల్లాలో….

తాజాగా.. జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి ప‌ర్యట‌న పెట్టుకున్నారు. ఈ నెల 4న ఏలూరులో పర్యటించారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ ప‌ర్యట‌న కూడా కావాల‌ని చేస్తోంది కాదు. ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి వెళ్లే క్రమంలోనే ఆయ‌న ఈ శంకుస్థాప‌న కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నార‌ని అంటున్నారు. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఈ ప‌ర్యట‌న‌ల‌పై మంత్రి ఆళ్లనాని స‌మీక్షించారు. అయితే, సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడా “అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా“ అత్యంత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు.

పూర్తి భద్రతతో…..

నిజానికి గ‌త ఆరు మాసాల కింద‌టి వ‌ర‌కు కూడా ఇలా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌ర్కారు భావిస్తోందంటే జ‌గ‌న్ చుట్టూ ఏదో జ‌రుగుతోంద‌నే చర్చ సొంత పార్టీలోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే జ‌గ‌న్ జిల్లాల ప‌ర్యట‌న‌కు జంకుతున్నార‌నే భావ‌న వినిపిస్తోంది. మ‌రి అస‌లు నిజం ఏంటో వాళ్లకే తెలియాలి.

Tags:    

Similar News