ఆ ప్రకటన అప్పుడేనట.. అంతా ఓకేనట

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ [more]

Update: 2020-11-04 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజవకర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని జగన్ భావించి ఈ మేరకు హామీ ఇచ్చారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు….

మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటిస్తే రాజకీయంగా వైసీపీకి కూడా లాభం ఉంటుందని జగన్ నమ్ముతున్నారు. అందుకోసమే వడివడిగా నూతన జిల్లాల ఏర్పాటుకు జగన్ రెడీ అయిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.

డెడ్ లైన్ విధించి…..

అయితే జగన్ దీనికి డెడ్ లైన్ విధించారు. రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటించాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కమిటీ కూడా అధ్యయనం చేస్తుంది. జిల్లాల్లో నెలకొన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి కూడా కమిటీకి అనేక వినతులు అందాయని తెలుస్తోంది. కొత్త జిల్లాలో తమ ప్రాంతాలను కలపవద్దని కొందరు కోరగా, తమను ఈ జిల్లాలో కలపాలని మరికొందరు వినతులు అందజేశాయి.

కొత్త జిల్లాల ప్రకటన…..

కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రాధమికంగా కమిటీ ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. 26 జిల్లాల ప్రకటన వచ్చే ఏడాది జనవరి 26న జగన్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే కొంత సంక్లిష్టత ఉందని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన కొత్త జిల్లాల ప్రకటన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News