జగన్ మాత్రం ఎన్నికలు ఆ తర్వాతే నంటున్నారే?

జగన్ ఆలోచనలు వేరు. తాను అనుకున్న పథకాలన్నీ గ్రౌండ్ అయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటుతుంది. [more]

Update: 2020-10-31 09:30 GMT

జగన్ ఆలోచనలు వేరు. తాను అనుకున్న పథకాలన్నీ గ్రౌండ్ అయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటుతుంది. సంక్షేమ పథకాలను వరస బెట్టి జగన్ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం జిరిపిన సర్వేల్లో తేలింది. దీంతో పాటు మరికొన్ని పథకాలను అమలు చేసి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.

ఇళ్ల స్థలాల పట్టాలు……

ప్రధానంగా రాష్ట్రంలో పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంచిపెట్టాలనుకున్నారు. అయితే వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. మొన్న ఉగాది నాటికే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సి ఉన్నా న్యాయపరమైన చిక్కులు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత అడ్వాంటేజీ ఉంటుందని వైసీపీ చీఫ్ జగన్ భావిస్తున్నారు.

సంక్షేమ పథకాల రెండో విడత…

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని జగన్ భావించినా అది కూడా న్యాయపరమైన చిక్కులతో సాధ్యం కాలేదు. దీనికితోడు మరికొంత కాలం ఆగితే మళ్లీ సంక్షేమ పథకాల రెండో విడత నిధులు ప్రజల అకౌంట్ లోకి వెళతాయి. అమ్మఒడి, రైతు భరోసా వంటి పధకాలు రెండో విడత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది జగన్ అభిప్రాయంగా ఉంది.

మరోసారి కోర్టుకు తప్పదా?

కానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలను నిర్వహించేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సుముఖంగా లేదు. ఎన్నికల కమిషన్ సంసిద్ధత తెలియజేసినా ప్రభుత్వం నో చెప్పాలని సిద్ధమయింది. మరి హైకోర్టు జోక్యం చేసుకుంటే జగన్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పదు. మొత్తం మీద జగన్ ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు మాత్రం సుముఖంగా లేరు.

Tags:    

Similar News