ఢిల్లీ చుట్టూ తిరిగినా ఫలితం లేదా?

“ కేంద్రంతో మంచిగా ఉందాం. ప్లీజ్.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ.. ప‌నులు సాధించుకుందాం..! “ ఇదీ ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌. దీనినే ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. [more]

Update: 2020-10-31 05:00 GMT

“ కేంద్రంతో మంచిగా ఉందాం. ప్లీజ్.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ.. ప‌నులు సాధించుకుందాం..! “ ఇదీ ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌. దీనినే ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. ఆయ‌న ప్లీజ్ అంటూ.. రాష్ట్ర స‌మ‌స్యల‌పై నివేదిక‌లు ఇస్తున్నారు. అయితే. చాలా వ‌ర‌కు స‌మ‌స్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం అడుగులు ఒక‌టి ముందుకు నాలుగు వెన‌క్కి అన్నట్టుగా త‌యారైంది ప‌రిస్థితి. మ‌రోవైపు స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్న ప‌రిస్థితి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి స్పష్టంగా క‌నిపిస్తోంది.

అనేక కార్యక్రమాలు నిలిచి……

ఈ నేప‌థ్యంలో ఇప్పటికే ఉన్న ప‌థ‌కాల‌ను పూర్తి చేయ‌డం, కొన్ని కొత్త వాటిని ప్రవేశ పెట్టాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్రధానంగా కొన్ని కీల‌క ప‌ధ‌కాలు నిలిచిపోవ‌డం, వాటి విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోక‌పోవ‌డంపైనా జ‌గ‌న్ ఆవేద‌నతోనే ఉన్నారు. వీటిలో ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో.. ఆంగ్ల మాధ్యమం, దిశ చ‌ట్టం అమ‌లు, జిల్లాల విభ‌జ‌న‌, నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో పాటు.. పోల‌వ‌రం నిధుల విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న ‌వైఖ‌రితో జ‌గ‌న్ మాన‌సికంగా కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇన్ని ప‌థ‌కాలు నిలిచిపోయిన ప‌రిస్థితిలో ఎలా ముందుకు వెళ్లాల‌నేది ఆయ‌న ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయినా సహకరించడం లేదే…..

అదే స‌మయంలో పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం కూడా ముందుకు సాగ‌డం లేదు. ఇదిలావుంటే, కేంద్రం చెబుతున్న కొన్ని ప‌థ‌కాల‌ను తూ.చ త‌ప్పకుండా అమ‌లు చేస్తున్నారు. విద్యుత్ మీట‌ర్లు, వాహ‌నాల‌పై జ‌రిమానాలు, కేంద్ర ప‌థ‌కాల అమ‌లు వంటివాటిని అమ‌లు చేస్తున్నారు. అయినా కూడా కేంద్రం రాష్ట్రానికి ఆశించిన మేరకు స‌హ‌క‌రించ‌ని కార‌ణంగా ఆయా ప‌థ‌కాలు న‌త్తన‌డ‌క‌న సాగుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

పూర్తి కాకుండా వెళితే….?

వ‌చ్చే ఏడాదిలో ఎట్టి ప‌రిస్థితిలోనూ స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో.. ఇవ‌న్నీ కేంద్రం ఆమోదిస్తే.. త‌ప్ప జ‌ర‌గ‌ని ప‌నులు కావ‌డంతో ఒకింత త‌ర్జన భ‌ర్జన క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌థ‌కాల అమ‌లుపై ఇప్పటికే ఆరు నెల‌లుగా అనేక వాయిదాలు ప‌డుతున్నాయి. దీంతో కొన్ని వ‌ర్గాల ప్రజ‌ల్లో ఒకింత అస‌హ‌నం కూడా ఉంది. వారిని సంతృప్తి ప‌ర‌చ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళితే జ‌గ‌న్ అనుకున్నంత ఏక‌ప‌క్షంగా అయితే స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫలితాలు రావు. మ‌రి దీనిపై ఏం చేయాల‌నే విష‌యంపై వైసీపీలో నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న మాట వాస్తవమేన‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News